iDreamPost

జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్! తెలుసుగా అంటూ..

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అసలు జైస్వాల్ కు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అసలు జైస్వాల్ కు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్! తెలుసుగా అంటూ..

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టారు. ఇక పొట్టి ప్రపంచ కప్ లో తమ తొలి మ్యాచ్ లో జూన్ 5న ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడనుంది. ఇంతకంటే ముందే బంగ్లాదేశ్ తో జూన్ 1న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం గ్రౌండ్ లో చెమటలు చిందిస్తున్నారు ఆటగాళ్లు. అయితే ప్రాక్టీస్ అనంతరం సేదతీరడం కోసం న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కు వార్నింగ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అసలేం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ ను సాధించాలన్న కసితో న్యూయార్క్ లో అడుగుపెట్టింది టీమిండియా. ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టింది. ఎలాగైనా ఇండియాకు పొట్టి కప్ తోనే తిరిగి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం కఠోరంగా శ్రమిస్తోంది. ఇక ప్రాక్టీస్ అనంతరం సరదాగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు ఆటగాళ్లు. న్యూయార్క్ అందాలను తన సెల్ ఫోన్ లో బంధిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.

అయితే యశస్వీ జైస్వాల్ షేర్ చేసిన ఫొటోలపై టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జైస్వాల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. “తోటల్లో తిరిగితే ఏమౌతుందో తెలుసుగా.. జాగ్రత్త” అంటూ నవ్వుతున్న ఎమోజీని పెట్టాడు. సూర్య ఇలా కామెంట్ పెట్టడానికి కారణం వేరే ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్లేయర్లను కెప్టెన్ రోహిత్ శర్మ మందలించాడు. గ్రౌండ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. బాగోదు.. తోటల్లో తిరుగుతున్నట్లు తెలిస్తే.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. తాజాగా జైస్వాల్ న్యూయార్క్ లోని పార్కుల్లో తిరుగుతున్న ఫోటోలను షేర్ చేయగా.. సింక్ అవుతాయని స్కై ఆ విధంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. కానీ కొందరు దిగ్గజాలు మాత్రం విరాట్ కోహ్లీ-జైస్వాల్ ను ఓపెనర్లుగా దించాలని సూచిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి