iDreamPost
android-app
ios-app

సచిన్, గవాస్కర్ కాదు.. ఆ స్టార్ క్రికెటరే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి

టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్నకు సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లను కాదని ఆ ఆటగాడే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చారు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.

టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్నకు సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లను కాదని ఆ ఆటగాడే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చారు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.

సచిన్, గవాస్కర్ కాదు.. ఆ స్టార్ క్రికెటరే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నిత్యం విదేశీ వ్యవహారాలతో ఎంతో బిజీ బిజీగా ఉంటారు. పాకిస్తాన్, చైనా దేశాల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.. భారత్ ను ముందుకు తీసుకెళ్లడంలో జైశంకర్ ది కీలక పాత్ర. ఇక క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే జైశంకర్ కు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్నకు సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లను కాదని ఆ ఆటగాడే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చారు విదేశాంగ శాఖ మంత్రి. మరి ఇంతకీ జైశంకర్ మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. టీమిండియా క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్ ఎవరు? అని సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ అనే మూడు ఆప్షన్లు ఇచ్చారు. తాను విరాట్ కోహ్లీనే ఎంచుకుంటాను అని ఆయన సమాధానం ఇచ్చారు. కోహ్లీనే ఇష్టపడటానికి కారణం కూడా చెప్పారు. “విరాట్ కోహ్లీ ఫిట్ నెస్, అతడి యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కోహ్లీని పిక్ చేసుకున్నాను. ఇవి కాకుండా సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లను పక్కన పెట్టడానికి వేరే రీజన్స్ లేవు” అని జైశంకర్ పేర్కొన్నారు.

ఇక 35 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లీ ఎంతో ఫిట్ గా ఉన్నాడు. ఆటపట్ల అతడి అంకిత భావం, దృక్ఫతం కోహ్లీని టాప్ క్రికెటర్ గా నిలబెడుతున్నాయి. విరాట్ ఫిట్ నెస్, ప్రవర్తన నేటి తరం కుర్రాళ్లకు ఆదర్శం. కాగా.. కోహ్లీని ప్రపంచంలో ఉన్న వివిధ రంగాల సెలబ్రిటీలు సైతం ఇష్టపడటం మనకు తెలియని విషయం కాదు. గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా అప్రోచ్ అవుతాడో.. అంతే సరదాగా ఉంటాడు. ఇక తనను కవ్విస్తే మాత్రం అంతకంటే ఎక్కువ రేంజ్ లో కౌంటర్ ఇస్తాడు. అందుకే విరాట్ ను  ఇంతలా అభిమానిస్తూ ఉంటారు. ఈ జాబితాలోకి స్వయనా కేంద్ర విదేశాంగ మంత్రి కూడా వచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ముగిసిన ఐపీఎల్ లో రన్ మెషిన్ పరుగుల వరదపారించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడి 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఇదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా కప్ కొట్టడం ఖాయమే. మరి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి