iDreamPost

Unstoppable With NBK : అబ్బాయి తర్వాత బాబాయ్ తో సూపర్ స్టార్

Unstoppable With NBK : అబ్బాయి తర్వాత బాబాయ్ తో సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒకపక్క అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ మరోపక్క ఆహ కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో విజయంతో దూసుకుపోతున్నారు. మాములుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మీద ఇంటర్వ్యూలు అంతగా సక్సెస్ కావు. దీనికి భిన్నంగా బాలయ్య షో మాత్రం మంచి రెస్పాన్స్ తో అదరగొడుతోంది. మొదటి ఎపిసోడ్ లో వచ్చిన మంచు ఫ్యామిలీ కన్నా తర్వాత స్ట్రీమింగ్ అయిన నాని ఎపిసోడ్ కి ఇదయ్యాక వీటిని మించి బ్రహ్మానందం-అనిల్ రావిపూడి భాగానికి భారీ స్పందన దక్కింది. సోషల్ మీడియాలోనూ ఇదే బెస్ట్ అని కితాబులు అందుతున్నాయి. ఇప్పుడీ షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు ఆహా రంగం సిద్ధం చేసింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో పాల్గొనబోతున్నట్టు సమాచారం. దీని షూటింగ్ రేపే చేస్తున్నారని టీవీ వర్గాల నుంచి అందుతున్న లీక్. ఆ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులులో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ ఇప్పుడు తారక్ బాబాయ్ బాలయ్యతో ఇలా తెరను పంచుకోవడం విశేషం. ఇది అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని తెలిసింది. మహేష్ క్లాసు బాలకృష్ణ మాస్ ఇలా ఇద్దరూ రెండు విభిన్న ధృవాలు. మరి ప్రశ్నలు సమాధానాలు అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

మొత్తానికి ఆహా 2.0 లాంచ్ తర్వాత స్పీడ్ పెంచింది. వారానికో కొత్త సినిమాతో వ్యూయర్స్ కి వినోదానికి లోటు లేకుండా చేస్తోంది. రొమాంటిక్, మంచి రోజులు వచ్చాయి, పుష్పక విమానం ఇలా నాన్ స్టాప్ గా న్యూ రిలీజెస్ ని క్యూలో పెడుతోంది. ఇవి స్టార్ హీరోలవి కాకపోయినా ఉన్నంతలో మార్కెట్ లో లేటెస్ట్ వే కాబట్టి రేటింగ్స్ బాగా వస్తాయి. అంతకు ముందు లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లతో అలరించిన ఆహా అన్ స్టాపబుల్ షో కోసం ఇంకెవరెవరిని గెస్టులుగా తీసుకురాబోతోందో వేచి చూడాలి. విజయ్ దేవరకొండ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం

Also Read : Liger : పూరీ వాడకం… మైక్ టైసన్ తో పాటు బాలయ్య కూడా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి