iDreamPost
android-app
ios-app

కన్ఫ్యూజ్ చేస్తున్న సూపర్ స్టార్

  • Published Feb 24, 2020 | 10:35 AM Updated Updated Feb 24, 2020 | 10:35 AM
కన్ఫ్యూజ్ చేస్తున్న సూపర్ స్టార్

సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు అల వైకుంఠపురములోని డామినేట్ చేయాలని కోరుకున్నాడు కానీ అది సాధ్య పడకపోవడం అభిమానులకు కొంత అసంతృప్తినైతే మిగిల్చింది. సరే వరసగా మూడో వంద కోట్ల సినిమాతో హ్యాట్రిక్ అయితే దక్కిందిగా అనుకుంటూ సర్దుకున్నారు. ఇదిలా ఉండగా మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తోంది.

మొన్నటిదాకా వంశీ పైడిపల్లి పేరు చాలా గట్టిగా వినపడింది. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ కూడా స్టోరీ డిస్కషన్స్ చేసుకున్నారని టాక్ వచ్చింది. ఇంతలో ఏమైందో ప్రస్తుతానికి అది పెండింగ్ లో పెట్టినట్టుగా వస్తున్న వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రంలో రామ్ చరణ్ బదులు మహేష్ చేస్తాడనే న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ లోనూ దావాలనంలా వ్యాపించిపోయింది. ఇందులో నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తీయబోయే ఎఫ్3లో మహేష్ సెకండ్ హాఫ్ లో కనిపించే చాలా కీలకమైన రోల్ చేస్తాడని కూడా వినిపించింది. కానీ దాని గురించి దర్శకుడితో సహా మాట్లాడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. మరోవైపు పరశురామ్ తో ఉండొచ్చని మరో వర్షన్ బయటికి వచ్చింది. అతను ఆల్రెడీ నాగ చైతన్యకు లాక్ అయిపోయాడు. మరి దాన్ని వదిలేసి మహేష్ దగ్గరకు వస్తాడా అనేది వేచి చూడాలి. ఇవి చాలవు అన్నట్టుగా కొత్తగా ప్రవీణ్ సత్తారు పేరు తెరమీదకు వచ్చింది. గరుడవేగతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు రామ్ తో చేయాల్సిన సినిమా పూజ కార్యక్రమాల తర్వాత ఆగిపోయింది. మరి బ్రాండ్ ఇమేజ్ బలంగా లేని ప్రవీణ్ సత్తారుతో ప్రిన్స్ నిజంగా చేస్తాడా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరో ఒకరితో ఫైనల్ అయిపోయి ఇదే ఏడాది రెండో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇన్ని అయోమయాల మధ్య ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి అదేదో మహేష్ స్వయంగా క్లారిటీ ఇస్తే బెటర్

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet