iDreamPost
android-app
ios-app

బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్! సంతోషంలో ఫ్యాన్స్..

  • Published Dec 17, 2023 | 1:47 PM Updated Updated Dec 17, 2023 | 1:47 PM

Sudheer Re Entry: సుడిగాలి సుదీర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ఫేమసై..వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుధీర్ తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.

Sudheer Re Entry: సుడిగాలి సుదీర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ఫేమసై..వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుధీర్ తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.

  • Published Dec 17, 2023 | 1:47 PMUpdated Dec 17, 2023 | 1:47 PM
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్! సంతోషంలో ఫ్యాన్స్..

సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయం అయ్యారు. ఇక ఈషోలో తనదైన కామెడీతో ఆడియన్స్ ను తెగ అల్లరించేవాడు. ఇక జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా సుధీర్ మారిపోయారు. ఆ తరువాత తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు సుధీర్. ఇలా బుల్లితెరపై వచ్చిన అవకాశాలతో  హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈక్రమంలోనే బుల్లితెరపై కనిపించడం మానేశాడు. చాలా రోజుల తరువాత మళ్లీ ఓ షోలో రీఎంట్రీ ఇచ్చి.. సందడి చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జబర్దస్త్ షోలో సుధీర్,యాంకర్ రష్మీతో కలిసి నడిపిన లవ్ ట్రాక్  అదిరిపోయింది. అదంతా కేవలం స్కిట్ కోసమే అని తెలిసినప్పటికీ..వీరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ కావడంతో అందరు నిజమని నమ్మారు. జబర్ధస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో సుడిగాలీ సుధీర్ కు బుల్లితెరపై అనేక అవకాశాలు వచ్చాయి. ఇలా సుధీర్ పలు షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తుంటే ఎంతో సందడిగా ఉండేది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో సుధీర్ కి వెండితెరపై అవకాశం లభించింది.

అనేక సినిమాల్లో సైడ్ పాత్రల్లో కూడా నటించాడు. ఆ తరువాత హీరోగా కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, వాటెండ్ పండుగాడ్, గాలోడు  వంటి  సినిమాల్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇలా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సుధీర్..బుల్లితెరకు దూరమయ్యాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ జోడీ, జాక్ పాట్, పోవే పోరా, శ్రీదేవి డ్రామాకంపెనీలో షోల్లో సందడి చేశాడు.

ఇక ఢీ షో విషయానికి వస్తే..అనేక సీజన్లలో సుధీర్ పాల్గొన్నారు. యాంకర్ ప్రదీప్, ఆదితో కలిసి సుధీర్ ప్రేక్షకులను అలరించాడు. రష్మీ, వర్షిణీ, ఆది, సుధీర్ ల మధ్య జరిగే కామెడీ సీన్ వేరేలెవెల్ ఉంటాయి. ఇలా సాగిపోతున్న సమయంలో ఇటీవల వచ్చిన ఢీ షోలో సుధీర్  కనిపించలేదు. దీంతో అతడి లేని లోటు క్లియర్ గా కనిపిస్తుందని సుధీర్ ఫ్యాన్స్ అభిప్రాయా పడుతున్నారు. ఈక్రమంలోనే ఢీ ప్రీమియర్ లీగ్ లో ఫ్రీ ఫైనల్ ఎపిసోడ్ లో సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో కాసేపు ఆ స్టేడ్ విజిల్స్ తో మారు మోగింది. తనదైన మ్యానరిజమ్ చూపిస్తూ.. సుధీర్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు.

చాలా కాలం తరువాత సుధీర్ బుల్లితెరపై కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ అన్నని ఢీ లో  చూడటం చాలా హ్యాపీగా ఉందని, ప్రదీప్, సుధీర్, ఆది, ఈ ముగ్గురు ఉంటే  ఆ షో రచ్చ రచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక సుధీర్ ను చాలా మిస్సవుతున్నా అంటూ నటి పూర్ణ ఎమోనలయ్యారు. సుధీర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త’ ప్రమోషన్లో భాగంగా వచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికే చాలా కాలం తరువాత సుధీర్ బుల్లితెరపై కనిపించడంతో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరి.. సుధీర్ ఎంట్రీ ఇచ్చిన ఆ ఎపిసోడ్ ను మీరు కూడా వీక్షించండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcepbahis girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio