iDreamPost
android-app
ios-app

క్రాక్ కాంబినేషన్ కి స్టార్ హీరోయిన్ ఫిక్స్..?

  • Author ajaykrishna Published - 03:48 PM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 03:48 PM, Wed - 20 September 23
క్రాక్ కాంబినేషన్ కి స్టార్ హీరోయిన్ ఫిక్స్..?

ఇండస్ట్రీలో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ అందుకున్న కాంబినేషన్స్ లో మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో ఒకటి. డాన్ శీను మొదలుకొని బలుపు, క్రాక్ సినిమాలతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెంచేశారు. ఇప్పటిదాకా వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడం విశేషం. డాన్ శీను మూవీ హిట్ అనిపించుకోగా.. బలుపు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక మూడోది క్రాక్ హాఫ్ రేట్ టికెట్ ప్రైస్ లలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. అయితే.. ఇప్పుడు ఈ కాంబో నాలుగో సినిమాకు రెడీ అవుతోంది.

గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమా నిర్మించారు మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వారు. ఇప్పుడదే ప్రొడక్షన్ లో రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ రాబోతుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు హై లెవెల్ లో నెలకొన్నాయి. ప్రస్తుతం గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. తాజాగా సినిమా హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన స్టార్ హీరోయిన్ నటించనుందని అంటున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మాస్ రాజా సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన ఓకే అయ్యిందని టాక్ బలంగా వినిపిస్తుంది.

ఈ క్రేజీ కాంబినేషన్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. రవితేజ పక్కన రష్మిక అనేసరికి ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే.. రవితేజతో రష్మిక కాంబో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. పైగా పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకొని.. బాలీవుడ్ లోను రాణిస్తుంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిలతో యానిమల్ చేస్తోంది. ఇక రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి గోపీచంద్ ఈసారి కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్ అయితే ఉంది. మరి రష్మికను కలుపుకొని క్రాక్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis