iDreamPost

విద్యార్థి బలవన్మరణం.. కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్ నోట్!

విద్యార్థి బలవన్మరణం.. కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్ నోట్!

పైన ఫొటోలో కనిపిస్తున్నయువతి పేరు శ్రావణి. హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఇకపోతే, ఈ యువతి ఉన్నట్టుండి ఇటీవల బాత్రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన తోటి విద్యార్థినులు షాక్ గురయ్యారు. వెంటనే కాలేజీ యాజమన్యానికి సమాచారం ఇవ్వడంతో అంతా అక్కడికి చేకుకున్నారు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆ యువతి చనిపోయే ముందు రాసిన ఓ సూసైడ్ నోట్ అందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. ఇంతకు ఆ అమ్మాయి అందులో ఏం రాసిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలోని మామిళ్ల గ్రామానికి చెందిన శ్రావణి (18) హిందూపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ యువతి ఇక్కడే హాస్టల్ లో ఉంటూ చదువుకునేది. ఇదిలా ఉంటే.. శ్రావణి గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఆపరేషన్ చేయడానికి తల్లిదండ్రుల వద్ద అంత స్థోమత లేకపోవడంతో శ్రావణి తరుచు బాధపడేది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆ విద్యార్థిని మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

ఇది గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని వెంటనే ఆ యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ తాజాగా మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇకపోతే.. ఆ యువతి చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచింది. అందులో ఏముందంటే? నేను గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాను..

నా తల్లిదండ్రుల వద్ద ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. పైగా నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. ఇక నేను నా తల్లిదండ్రులకు భారం కాకూడదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు భారం కాకూడదని బలవన్మరణానికి పాల్పడిన యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి