iDreamPost

ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.., కానీ..!

వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నారు. ఇటీవల తిరిగి ఇంటికొచ్చారు. కానీ, ఉన్నట్టుండి ఇలా జరగడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.

వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నారు. ఇటీవల తిరిగి ఇంటికొచ్చారు. కానీ, ఉన్నట్టుండి ఇలా జరగడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.

ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.., కానీ..!

ఇద్దరికి గతంలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా చాలా కాలం నుంచి ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. చివరికి ఈ ప్రేమికులు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా సరే ఇటీవల పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులు అతడిని ఇంట్లోకి రానివ్వలేదు. ఇక ఈ నూతన దంపతులు కొన్ని రోజుల పాటు గడిపి ఇటీవల ఇంటికి వచ్చారు. కట్ చేస్తే.. బుధవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇదే ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని గంగమ్ పల్లి గ్రామం. ఇదే ఊరిలో దాదా (30), జోత్స (26) అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. ఇద్దరిదీ ఓకే గ్రామం కావడంతో వీరికి పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే అప్పుడప్పుడు మాట్లాడుకునే వారు. అలా వీరి స్నేహం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అలా వీరి ప్రేమయాణం కొన్నేళ్ల పాటు కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇంతే కాకుండా ఇరు కుటుంబ సభ్యులు గొడవలు కూడా చేసుకున్నారు.

పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇలా అయితే కాదని భావించి ఈ ప్రేమికులు నాలుగు నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇంత కాలం ఈ నూతన దంపతులు బయట కాపురం పెట్టారు. ఇక దాదా తన భార్యను తీసుకుని ఇటీవల ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులను ఒప్పించి తన భార్యతో పాటు ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, ఈ క్రమంలోనే యువతి, యవకుడి కుటుంబ సభ్యులు మరోసారి గొడవ పడ్డారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఈ నూతన దంపతులు తోటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లారు. కానీ, ఆ రోజు సాయంత్రమైన తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో దాదా కుటుంబ సభ్యులు కంగారుపడి అంతటా వెతికారు. ఈ క్రమంలోనే ఈ భార్యాభర్తలు వారి తోటలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారిద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్య ఈ నూతన దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి