Nidhan
ఐపీఎల్-2024 ఫస్టాఫ్‌లో చెలరేగిన సన్‌రైజర్స్.. సెకండాఫ్‌లో వరుస ఓటములతో కాస్త డీలా పడింది. అయితే టీమ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని పట్టుదలతో ఉన్న కెప్టెన్ కమిన్స్ మాస్టర్‌ప్లాన్ రెడీ చేస్తున్నాడు.
ఐపీఎల్-2024 ఫస్టాఫ్‌లో చెలరేగిన సన్‌రైజర్స్.. సెకండాఫ్‌లో వరుస ఓటములతో కాస్త డీలా పడింది. అయితే టీమ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని పట్టుదలతో ఉన్న కెప్టెన్ కమిన్స్ మాస్టర్‌ప్లాన్ రెడీ చేస్తున్నాడు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ టీమ్ పేరు వింటేనే ఈసారి ఐపీఎల్లో అందరికీ దడ పుడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ లాంటి బ్యాటింగ్ రాక్షసులతో నిండిన ఈ జట్టుతో మ్యాచ్ అంటేనే అందరూ భయపడుతున్నారు. 250 ప్లస్ స్కోర్లను కూడా నీళ్లు తాగినంత అలవోకగా బాదేసే ఆరెంజ్ ఆర్మీ ఎక్కడ తమ మీదకు వచ్చి పడుతుందోనని అపోజిషన్ టీమ్స్ వణుకుతున్నాయి. అయితే ఇదంతా ఈ సీజన్ ఫస్టాఫ్ వరకు జరిగిన స్టోరీ. సెకండాఫ్ మొదలైందో లేదో కమిన్స్ సేనను వరుస పరాజయాలు పలకరించాయి. ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటములతో టీమ్ కాస్త డీలా పడింది. అయితే భయపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే మన టీమ్‌లో ఓ పవర్ హౌజ్ ఉన్నాడు.
క్రికెట్ అనే కాదు.. ఏ టీమ్ గేమ్లోనైనా కెప్టెన్ చాలా కీలకం అవుతారు. టీమ్ ఎంత బలంగా ఉందనేది ఎంత ముఖ్యమో, సారథిగా ఎవరు ఉన్నారనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓటమి కోరల్లో నుంచి జట్టును బయటపడేయాలన్నా, ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేయాలన్నా నిఖార్సయిన కెప్టెన్ ఉండాలి. సన్‌రైజర్స్‌లో అలాంటి సారథి ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ రూపంలో తెలివైన, బలమైన నాయకుడు ఆరెంజ్ ఆర్మీలో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోతే జట్టు పనైపోయిందని, ఇంక అస్సాంకే అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొందరు సొంత అభిమానులు కూడా ఇక హైదరాబాద్ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. కానీ కమిన్స్ టీమ్‌లో ఉన్నాడని, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నుంచి టీమ్‌ను గట్టెక్కించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని మాత్రం మర్చిపోతున్నారు.
వన్డే వరల్డ్ కప్-2023 ఆరంభంలో ఆస్ట్రేలియా వరుస మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు పనైపోయిందని అంతా భావించారు. కానీ కమిన్స్ సారథ్యంలోని టీమ్ తిరిగి పుంజుకొని ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది. అదే కమిన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు కెప్టెన్‌గా ఉన్నాడు. టీమ్ జస్ట్ రెండు మ్యాచుల్లోనే ఓడింది. టార్గెట్ ఛేజ్ చేయడంలో ఉన్న లోటుపాట్లతో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లోని బలహీనతలు ఇప్పుడే బయటపడ్డాయి. కాబట్టి వాటిని సరిదిద్దుకొని బౌన్స్ బ్యాక్ ఇవ్వొచ్చు. అదే ప్లేఆఫ్స్‌లో గనుక ఇలాంటి ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి బయటకొచ్చేసే పరిస్థితి. ఓటమికి అందరూ భయపడతారు. కానీ కమిన్స్ ఓటమిని మెట్లుగా మార్చుకొని టీమ్‌కు టైటిల్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్లేఆఫ్స్‌కు ముందు టీమ్ కాంబినేషన్‌ను పకడ్బందీగా సెట్ చేయడానికి ఆస్ట్రేలియా తరహా వ్యూహం పన్నుతున్నాడు. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తున్నాడు. ఇది గానీ వర్కౌట్ అయిందా ఇక తెలుగు జట్టును కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరు.
ఇదీ చదవండి: Chandini Chowdary: చాందినీ చౌదరిపై మండిపడుతున్న SRH ఫ్యాన్స్.. ఓ రేంజ్లో ట్రోల్స్!