iDreamPost

RCBని ఓడించి కప్ ఎగరేసుకుపోయిన SRH.. ఇది ఐపీఎల్ కాదు..!

  • Published Jan 13, 2024 | 7:43 PMUpdated Jan 13, 2024 | 7:43 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద గెలిచి కప్ ఎగరేసుకుపోయింది. అయితే ఇది ఐపీఎల్​లో మాత్రం కాదు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు మీ కోసం..

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద గెలిచి కప్ ఎగరేసుకుపోయింది. అయితే ఇది ఐపీఎల్​లో మాత్రం కాదు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు మీ కోసం..

  • Published Jan 13, 2024 | 7:43 PMUpdated Jan 13, 2024 | 7:43 PM
RCBని ఓడించి కప్ ఎగరేసుకుపోయిన SRH.. ఇది ఐపీఎల్ కాదు..!

సన్​రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఇతర టాప్ టీమ్స్​లా ఎక్కువ సార్లు ట్రోఫీలు గెలవకపోయినా ఎస్​ఆర్​హెచ్​కు హ్యూజ్ ఫ్యాన్​ బేస్​ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ టీమ్​ను ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉన్నారు. గత కొన్నేళ్లుగా క్యాష్ రిచ్ లీగ్​లో తరచూ ఫెయిల్ అవుతూ వస్తోంది సన్​రైజర్స్. చివరగా 2016లో ఐపీఎల్ ట్రోఫీని నెగ్గిందీ ఫ్రాంచైజీ. ఆ తర్వాత 2018లో రన్నరప్​గా నిలిచింది. 2019, 2020ల్లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లగలిగింది. కానీ గత మూడు సీజన్లుగా ఎస్​ఆర్​హెచ్​ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోతోంది. గత సీజన్​లోనైతే 14 మ్యాచుల్లో నాలుగింట్లోనే నెగ్గి పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో నిలిచింది. అలాంటి ఎస్​ఆర్​హెచ్​ జట్టు ఆర్సీబీని ఓడించి ఓ కప్​ను ఎగరేసుకుపోయింది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో సౌతిండియన్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరును ఓడించింది. అయితే ఇది ఐపీఎల్​లో మాత్రం కాదు. అహ్మదాబాద్ వేదికగా అన్ని ఐపీఎల్ టీమ్స్ మధ్య కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో ఆర్సీబీ, ఎస్​ఆర్​హెచ్​ ఫైనల్స్​కు క్వాలిఫై అయ్యాయి. అయితే ఆసక్తికర పోరులో సన్​రైజర్స్​ను విజయం వరించింది. ఈ ఏడాది కైట్ ఫెస్టివల్ విన్నర్​గా హైదరాబాద్ నిలిచింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎస్​ఆర్​హెచ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కైట్ ఫెస్టివల్ కప్పే కాదు తమకు ఐపీఎల్ ట్రోఫీ కూడా కావాలని అంటున్నారు. కొత్త ఏడాదిని పాజిటివ్​గా స్టార్ట్ చేశారని.. ఇదే ఊపులో ఐపీఎల్ కప్పును కూడా సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఐపీఎల్​-2024లో ఫేవరెట్ టీమ్స్​లో ఒకటిగా బరిలోకి దిగనుంది సన్​రైజర్స్ హైదరాబాద్. దీనికి కారణం గతంలో కంటే ఇప్పుడు టీమ్ మరింత స్ట్రాంగ్​గా తయారవ్వడమనే చెప్పాలి. పదిహేడో సీజన్​కు ముందు నిర్వహించిన మినీ ఆక్షన్​లో ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్​ను దక్కించుకుంది ఎస్​ఆర్​హెచ్​. కమిన్స్​తో పాటు ట్రావిస్ హెడ్, వనిదు హసరంగా లాంటి టాప్ ప్లేయర్స్​ను సొంతం చేసుకుంది. దీంతో జట్టు చాలా స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. టీమ్​లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్​తో పాటు దేశవాళీ ఆటగాళ్లు కూడా బాగా ఆడితే సన్​రైజర్స్​ను ఆపడం ఎవరి తరం కాదు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ టీమ్​గా కలసికట్టుగా పెర్ఫార్మ్ చేయడం ముఖ్యం. మరి.. ఈసారి ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్​గా అవతరిస్తుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: స్మిత్​ను దారుణంగా స్లెడ్జ్ చేసిన వార్నర్.. ఇన్నేళ్ల ఫ్రెండ్​షిప్ మర్చిపోయి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి