iDreamPost

Steve Smith: వీడియో: స్మిత్​ను దారుణంగా స్లెడ్జ్ చేసిన వార్నర్.. ఇన్నేళ్ల ఫ్రెండ్​షిప్ మర్చిపోయి..!

  • Published Jan 13, 2024 | 4:28 PMUpdated Jan 13, 2024 | 4:28 PM

స్మిత్, వార్నర్.. ఇద్దరూ స్టార్ ప్లేయర్సే. ఒకే జట్టుకు చాలా ఏళ్ల నుంచి కలసి ఆడుతున్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. అయితే దాన్ని మర్చిపోయి స్లెడ్జింగ్​కు దిగడం షాకింగ్​గా మారింది.

స్మిత్, వార్నర్.. ఇద్దరూ స్టార్ ప్లేయర్సే. ఒకే జట్టుకు చాలా ఏళ్ల నుంచి కలసి ఆడుతున్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. అయితే దాన్ని మర్చిపోయి స్లెడ్జింగ్​కు దిగడం షాకింగ్​గా మారింది.

  • Published Jan 13, 2024 | 4:28 PMUpdated Jan 13, 2024 | 4:28 PM
Steve Smith: వీడియో: స్మిత్​ను దారుణంగా స్లెడ్జ్ చేసిన వార్నర్.. ఇన్నేళ్ల ఫ్రెండ్​షిప్ మర్చిపోయి..!

గేమ్స్​లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణం అనే చెప్పాలి. క్రికెట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. స్లెడ్జింగ్​కు సంబంధించిన​ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటం చూసే ఉంటారు. కొన్ని టీమ్స్ ఈ విషయంలో బాగా ఆరితేరాయి. అయితే స్లెడ్జింగ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా టీమే. ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లను స్లెడ్జ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఫీల్డింగ్ టైమ్​లో అపోజిషన్ టీమ్ బ్యాటర్స్​ను రెచ్చగొడుతూ వాళ్లను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రత్యర్థి బ్యాటర్లు ఔటయ్యారు. అందుకే స్లెడ్జింగ్ అనేది కంగారూ టీమ్​కు ఓ ఆనవాయితీగా మారిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా ఆ జట్టు దీన్ని అలవాటుగా మార్చుకుంది. అయితే అపోజిషన్ టీమ్స్​ను స్లెడ్జ్ చేస్తే ఓకే.. కానీ కలసి ఆడిన సొంత జట్లు ఆటగాళ్ల మీదే స్లెడ్జింగ్​కు దిగడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. చాలా ఏళ్ల పాటు కలసి ఆడిన వార్నర్, స్మిత్​లు ఇప్పుడీ విషయంలో వైరల్ అవుతున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఫ్రెండ్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​ను దారుణంగా స్లెడ్జ్ చేశాడు. బిగ్​బాష్ లీగ్​ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్​, సిడ్నీ థండర్ టీమ్స్​కు మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఇందులో బ్యాటింగ్​కు వచ్చిన సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ స్మిత్​పై థండర్ జట్టు ఆటగాడు వార్నర్ స్లెడ్జింగ్​కు దిగాడు. క్రీజు దగ్గర సరిగ్గా మార్క్ చేసుకోవట్లేదని టీజ్ చేశాడు. అతడి దృష్టిని ఏదీ మరల్చలేదని చెప్పాడు. స్మిత్ చాలా ఫోకస్డ్​గా ఉంటాడని వ్యంగ్యంగా అన్నాడు. వార్నర్ మాటలకు అసహనానికి గురైన స్మిత్ (0) ఆడిన ఫస్ట్​ బాల్​కే లెగ్​ సైడ్ భారీ షాట్​కు ప్రయత్నించి ఫీల్డర్ చేతికి చిక్కాడు. దీంతో డేవిడ్ భాయ్ సంబురాల్లో మునిగిపోయాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది.

స్టీవ్ స్మిత్ గోల్డెన్ డక్​గా వెనుదిరిగినా జోష్ ఫిలిప్ (47), జోర్డాన్ సిల్క్ (35) రాణించడంతో ప్రత్యర్థి ముందు డీసెంట్​ టార్గెట్​ను ఉంచింది. అయితే సిడ్నీ థండర్ మాత్రం 19.5 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (37), అలెక్స్ హేల్స్ (28) తప్పితే మిగతా ఎవరూ రాణించలేదు. దీంతో 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్మిత్​ను స్లెడ్జింగ్ చేసి సక్సెస్ అయిన వార్నర్.. టీమ్​ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక, డేవిడ్ భాయ్ ఇటీవలే టెస్టులతో పాటు వన్డే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్​తో జరిగిన టెస్ట్ సిరీసే అతడికి చివరిది. దీంతో టెస్టుల్లో ఓపెనింగ్ బాధ్యతలను స్టీవ్ స్మిత్​కు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. బిగ్​బాష్​లో కూడా ఓపెనర్​గా దిగాడతను. కానీ ఆడిన తొలి బంతికే ఔటై నిరాశపర్చాడు. మొత్తానికి ఈ మ్యాచ్​లో గెలుపోటముల కంటే కూడా స్మిత్​ను వార్నర్ స్లెడ్జ్ చేయడం హైలైట్​గా నిలిచింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇంతకాలం కలసి ఆడిన ప్లేయర్​పై స్లెడ్జ్ చేయడం సరికాదని అంటున్నారు. యంగ్ క్రికెటర్స్​కు రాంగ్ మెసేజ్ వెళ్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్టీవ్ స్మిత్​ను వార్నర్ స్లెడ్జ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: హార్దిక్ వారసుడిగా తెలుగు ప్లేయర్! ఆశలు రేపుతోన్న విశాఖ ఆల్ రౌండర్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి