iDreamPost

Om Bheem Bush: ఓం భీమ్ బుష్….శ్రీ విష్ణు ఏం చెయ్యబోతున్నాడు

యంగ్‌ హీరో శ్రీ విష్ణ ఓం భీమ్‌ బుష్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మరి ఈ సినిమా కథ ఏంటి అంటే..

యంగ్‌ హీరో శ్రీ విష్ణ ఓం భీమ్‌ బుష్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మరి ఈ సినిమా కథ ఏంటి అంటే..

Om Bheem Bush: ఓం భీమ్ బుష్….శ్రీ విష్ణు ఏం చెయ్యబోతున్నాడు

అందరూ డిఫరెంట్ కథల మీదే పడుతున్నారు. ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలను తిప్పికొడుతున్నారన్న వాస్తవాన్ని అందరూ బాగా గ్రహించి, ఏదో ఒక నావెల్ పాయంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి తాపత్రయపడుతున్నారు. పైగా డబ్బింగ్ సినిమాల దాడిలో తెలుగు సినిమాల డిపాజిట్లు గల్లంతై పోయిన సందర్భాలు, ఉదంతాలు అనేకం ఉన్నాయి. అందుకని ఈ సారి శ్రీ విష్ణు వేరే ట్రాక్ కథని ఎంచుకున్నాడు. మొన్నీమధ్యనే విష్వక్సేన్ గామితో మంచి పేరుప్రతిష్టలు తెచ్చుకున్నాడు. సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర బాగానే క్లిక్ అయింది. కానీ తీరా ప్రేమలు వచ్చి పడగానే కొంత వరకూ గామి మీద దాని ప్రభావం పడకతప్పలేదు.

రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మళయాళం వాళ్ళని తెగ పొగిడేశాడు. దాంతో ఎంతో కొంత ప్రేమలు సినిమాకి జక్కన్న ప్రశంసలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇలాటి పరిస్థితులలో యంగ్ హీరోలైనా, సీనియర్ హీరోలైనా ఎత్తుకున్న పాయంట్స్ గనక వీక్ అయితే ఫలితాలు కూడా తలకిందులవుతాయనే గ్రహింపుతోనే శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ కథని ఎంచుకున్నాడని యూనిట్ సభ్యులు గట్టిగా చెబుతున్నారు.

om bhim bhush

ఏంటీ కథ?

ముగ్గురు సైంటిస్టులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ….ట్రెజర్ హంట్ పేరుమీద ఓ గ్రామానికి వెళ్తారు. ఫుల్ లెంత్ ఎంటర్టైనరే గానీ కొంత హారర్ ఆపెక్టులు కూడా కనిపించాయి ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్లో లో. శ్రీ విష్ణు ఫుల్ లెంత్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడని దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి చెబుతున్నాడు. టీజర్ కి మంచి గుర్తింపే వచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కథ కూడా అలా ఇలా ఉండదని తిరుగులేని ధీమాతో చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే ఇండియన్ సినిమాలోనే ఇటువంటి పాయంట్ రాలేదని కూడా భరోసా ఇస్తున్నాడు శ్రీ హర్ష.

‘’మొత్తం కథనంతా రివీల్ చేయలేం కదా. ప్రస్తుతానికి టీజర్ లో ఎంతో కొంత చెప్పడానికి ట్రైం చేశాం అది అందరికీ అప్పీలింగ్ గానే ఉంది. రెస్పాన్స్ అదిరింది. అక్కడి వరకూ మేం హేపీ. కథ నావెల్ గా ఉండడమే కాకుండా, ఢిపరెంట్ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి కథలో. ఇందులో యూనిక్ పాయంటే ఓ భీం బుష్ కి యుఎస్పీ. ఇంత వరకూ ఇండియన్ సినిమాలోనే ఎవ్వరూ టచ్ చేయని, డిస్కస్ చేయని పాయంట్ తో వస్తున్నాం. శ్రీ విష్ణు కామెడీ నెక్ట్స్ లెవెల్. సామజవరగమనా సినిమా కన్నా సూపర్ గా చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ క్యారెక్టర్స్ బాగా పండుతాయి.’’ అని ధీమాగా చెబుతున్నాడు.

శ్రీ విష్ణు ట్రాక్ రికార్డు ప్రస్తుతానికి స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఓం భీమ్ బుష్ బిజినెస్ కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. సినిమా కూడా ఆడియన్స్ ని ధ్రిల్ చేయగలిగితే టీం ఎఫెర్ట్ కి వేల్యూ వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి