iDreamPost

Sree Leela: అలా అయితే శ్రీలీలకు ఇక ఎదురే ఉండదు!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ కాలానికే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయారు శ్రీలీల. తెలుగులో వరుసగా స్టార్‌ హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం విడుదల కానుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ కాలానికే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయారు శ్రీలీల. తెలుగులో వరుసగా స్టార్‌ హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం విడుదల కానుంది.

Sree Leela: అలా అయితే శ్రీలీలకు ఇక ఎదురే ఉండదు!

మనకి తెలుగులో 2021లో పెళ్ళి సందడి సినిమా దగ్గర్నుంచీ తెలుసుగానీ, అంతకు ముందే శ్రీ లీల రెండు సినిమాలు కన్నడంలో చేసింది. కన్నడం తర్వాతే తెలుగుకి పరిచయం కావడం, అక్కడనుంచ ధమాకా లాంటి హండ్రెడ్ క్రోర్ క్లబ్ సినిమాలో ఛాన్స్ కొట్టడం ఇవన్నీ ఒకెత్తు. మరొక ఎత్తు ఏంటంటే….ధమకా నుంచి వరసగా గ్యాప్ లేకుండా శ్రీలీల ఎడాపెడా సినిమాలు సైన్ చేసి, వీర బిజీ అయిపోయి కనీసం ప్రమోషనల్ కేంపైన్ ఇంటర్వ్వూలకు కూడా మహా భాగ్యం అన్నట్టుగా దేనికి దొరక్కుండా పోయింది.

ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విషయమే. వచ్చిన రెండు మూడేళ్ళకే పదిపదిహేను సినిమాలు చేసేయడం, అవి కూడా పెద్ద హీరోలతో చేయడం, వాటిలో కొన్ని రికార్డు బ్రేకింగ్ హిట్లు కావడం…ఇదంతా ఇటీవలి రోజులలో ఏ హీరోయిన్ కెరీర్లోనూ చూడలేదు. ఆ క్రెడిట్ శ్రీలీలదే ముమ్మాటికి. ఎక్కువ సినిమాలు చేయడం….ఆ సినిమాల సందడి, హంగామా, హడావుడితో శ్రీలీల పబ్లిక్ నోటీసులోనే ఎక్కువగా ఉంటోంది అన్న అబ్జర్వేషన్ మొదలైంది.

నిజమే ఆ మధ్యంతా భగవంత్ కేసరి పబ్లిసిటీ కేంపైన్లో శ్రీలీల, బాలయ్య కాంబినేషన్లో ఇంటర్వ్యూలు ఇరగదీసేశారు. తర్వాత ఆదికేశవ్ సినిమా ప్రమోషన్స్. సినిమాలు ఆడుతున్నంత సేపు ఒకే. మధ్యలో ఒకటో రెండో ఫ్లాప్ అయితేనే ప్రాబ్లమ్. ఇప్పుడా ఆ ప్రాబ్లమే శ్రీలీల ఫేస్ చేయాల్సివచ్చింది. తాజాగా, సంక్రాంతి భరిలో ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో శ్రీలీల చేస్తున్న గుంటూరు కారం రేపోమాపో పబ్లిసిటీలోకి దూకుతుంది. నిజమే ఇటీవలి రోజులలో శ్రీలీలకి వచ్చినంత డిమాండ్ అండ్ క్రేజ్ మరెవ్వరికీ రాలేదు సరే.

అలాగని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం కూడా ఒక్కోసారి తప్పయిపోతుంది. అదే జరిగింది శ్రీలీల విషయంలో. ఇప్పుడింక పూర్తి కస్టడీలోకి తీసుకున్నారు శ్రీలీల మదర్ స్వర్ణ. టోటల్ గా శ్రీలీలను కంట్రోల్ చేసే పనిలో ఎప్పట్నుంచో ప్లాన్ చేసిన ఇంటర్వ్వూలను కూడా ఫిబ్రవరి ఎండ్ వరకూ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే రేపటి సంక్రాంతి బరిలోకి దూకుతున్న గుంటూరు కారం చిత్రంతో చాలా కాలం దాదాపుగా అంటే జనవరి నెలాఖరు వరకూ కూడా శ్రీలీల విపరీతమైన ఫోకస్లోనే ఉంటుంది.

గుంటూరు కారం హిట్‌ కొట్టిందా……శ్రీలీల గన్ కి ఎదురే ఉండదు. గుంటూరు కారం రిపోర్ట్ మాత్రం షాకింగ్ గానే ఉంది. సో….శ్రీలీల కెరీర్ ఎంత ఫాస్ట్ గా ఉరుకుతోందో….ఆ దూకుడికి స్పీడు బ్రేకర్లు కూడా అవసరమవుతున్నాయి. నో ఇష్యూస్ ఎటాల్….మొదట్లోనే సరిచేసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. మరి, శ్రీలీల జెట్‌ స్పీడ్‌ కెరీర్‌ గ్రోత్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి