Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, వారి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ గా మారడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే 2024 జగన్ అన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలు స్లోగన్ కూడా అందుకున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ కి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఎం తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కల్పించారు. దీని ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు. మరి.. ఆ యాక్ట్ ఏమిటి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీఎం జగన్ మోహన్ రెడ్డి రక్షణ విషయంలో పోలీస్ శాఖ చాలా అలెర్ట్ గా ఉంటుంది. కేవలం ఆయన భద్రత గురించి కాకుండా.. సీఎం కుటుంబ సభ్యలు రక్షణ గురించి కూడ చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలోనే సీఎం తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కల్పించారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్-2023 ను తీసుకువచ్చారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, తల్లి విజయలక్ష్మి, విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు భద్ర అందిచనున్నారు. జగన్ కుటుంబ సభ్యులందరికి అత్యంత సమీపం నుంచి భద్రతను కల్పించేందుకు ఈ ఎస్ఎస్‌జీని ఏర్పాటు చేస్తూ తాజాగా చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ ఎస్ఎస్‌జీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణా వలయంలగా ఉంటుంది. ప్రస్తుతం తీసుకువచ్చిన ఎస్‌ఎస్‌జీ చట్టం ప్రకారం జగన్ కుమార్తెలకు విదేశాల్లో కూడా భద్రత కల్పిస్తారు.
దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర సీఎంకి లేని విధంగా జగన్ కుటుంబం కోసం భద్రత కోసం ఇలా ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌జీని ఏర్పాటు చేశారు. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం లభిస్తే.. ఆ వెంటనే అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరికీ ప్రభుత్వ ఖర్చుతో భద్రత ఏర్పాటు చేస్తారు. ఇక ఎస్ఎస్‌జీ చట్టం-2023 ప్రకారం సీఎం జగన్, ఆయన సతీమణి, తల్లి, కుమార్తెలకి ప్రత్యేక భద్రత దక్కనుంది. ఇంట్లో ఉన్నపుడు.. ప్రయాణం చేస్తున్న సమయంలో.. ఎక్కడికైనా వెళ్లినపుడు.. ఒకవేళ ఎక్కడైనా బస చేసినపుడు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఎస్‌ఎస్‌జీ వారికి నిరంతరం భద్రతను కల్పిస్తుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అవసరమైన భద్రతపరమైన సేవలు అందించేందుకు ఎస్‌ఎస్‌జీలోని సభ్యులు సిద్ధంగా ఉండాలని ఈ చట్టంలో తెలిపారు. మరి.. సీఎం రక్షణకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.