iDreamPost

చంద్రబాబుకి హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ!

చంద్రబాబుకి హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనే షాకులు తిన్న బాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. తాజాగా మరోసారి హైకోర్టులో చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల కేసుల్లో చంద్రబాబు వేసిన మూడు బెయిల్ పిటిషన్లను  కోర్టు డిస్మిస్ చేసింది.

ఏపీ హైకోర్టులో మాజీ చంద్రబాబునాయుడుకి చుక్కెదురయ్యింది. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల కేసులకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అంగళ్లు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్  కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ల కేసుల్లో వేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. పైబర్ నెట్ కి సంబంధించి పలు కీలక విషయాలను హైకోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. ఈ కేసు చాలా  కీలక దశలో ఉందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు పరారయ్యారని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంతేకాక ఈ  ఫైబర్ గ్రిడ్ లో నాసిరకం వైర్ ని ఉపయోగించారంటూ పిన్ టూ పిన్ తమ వాదనలు వినిపించారు. దీంతో పైబర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కూడా హైకోర్టు కొట్టేసింది. ఇలా  ఈ మూడు కేసులు చూసినట్లయితే చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. దీంతో ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి  అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయన జైలుకు వెళ్లి నెల రోజులు దాటిపోయింది. ఆయన బయటకు వస్తాడని తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాక చంద్రబాబుకు సంబంధించిన కేసుల విషయంలో తమకు అనుకూలం తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు ఎదురు చూసిన ప్రతిసారి కోర్టులు గట్టి షాకిస్తున్నాయి. ఇప్పటికే క్వాష్ పిటిషను కొట్టేసి.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసి మరోసారి షాకిచ్చింది. మరి.. హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి