iDreamPost

క్రికెట్ ఆడుతూ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి.. ఉన్నచోటే కుప్పకూలి..!

  • Published Mar 04, 2024 | 1:48 PMUpdated Mar 04, 2024 | 1:48 PM

సరదాగా క్రికెట్ ఆడేందుకు పోతే ఏకంగా ప్రాణాలు పోయాయి. ఫ్రెండ్స్​తో కలసి క్రికెట్ ఆడుతున్న ఓ టెకీ గ్రౌండ్​లోనే కుప్పకూలాడు.

సరదాగా క్రికెట్ ఆడేందుకు పోతే ఏకంగా ప్రాణాలు పోయాయి. ఫ్రెండ్స్​తో కలసి క్రికెట్ ఆడుతున్న ఓ టెకీ గ్రౌండ్​లోనే కుప్పకూలాడు.

  • Published Mar 04, 2024 | 1:48 PMUpdated Mar 04, 2024 | 1:48 PM
క్రికెట్ ఆడుతూ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి.. ఉన్నచోటే కుప్పకూలి..!

సాఫ్ట్​వేర్ కంపెనీలో అతడు ఉద్యోగి. వర్క్ చేయడం, కుదిరితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్​తో కలసి క్రికెట్ ఆడటం అతడికి అలవాటు. ఈ క్రమంలో మరోమారు అలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. స్నేహితులతో కలసి మ్యాచ్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశాడు. అంతా బాగుందనుకున్న తరుణంలో హఠాత్పరిణామం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న ఆ యువకుడు తలనొప్పి రావడంతో ఆట మధ్యలోనే బయటకు వచ్చేశాడు. దీంతో హెల్త్ బాగోలేదని అంతా అనుకున్నారు. కానీ ఆ కాసేపటికీ టెకీ ఉన్నచోటే కుప్పకూలాడు. ఫ్రెండ్స్ అంతా కలసి అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు.

క్రికెట్ ఆడుతూ సంజయ్ భార్గవ్ (25) అనే యువ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. టీసీఎస్​లో వర్క్ చేస్తున్న సంజయ్.. మహేశ్వరంలోని ఘట్టుపల్లి కేసీఆర్ స్టేడియంలో మిత్రులతో కలసి సరదగా క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే ఆడుతున్న టైమ్​లో తలనొప్పి రావడంతో మధ్యలోనే బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో ఫిట్స్ కూడా రావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు ఫ్రెండ్స్. కానీ గుండెపోటుతో సంజయ్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఈ మధ్య సడన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిన సంగతి తెలిసిందే. వీటి బారిన పడి పెద్దలే కాదు పిల్లలు, యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా సాఫ్ట్​వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్​ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి