iDreamPost
android-app
ios-app

విజయ్ నానిల క్రేజీ మల్టీ స్టారర్ ?

  • Published Aug 10, 2022 | 4:09 PM Updated Updated Dec 20, 2023 | 6:49 PM

పడి పడి లేచే మనసుతో నిజంగానే పడిపోయాడనుకున్న హను రాఘవపూడి సీతారామం రూపంలో ఆవిష్కరించిన అద్భుతం దాన్నో బ్లాక్ బస్టర్ చేసింది. బింబిసార లాంటి బలమైన మాస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ పోటీని తట్టుకుని మరీ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు.

పడి పడి లేచే మనసుతో నిజంగానే పడిపోయాడనుకున్న హను రాఘవపూడి సీతారామం రూపంలో ఆవిష్కరించిన అద్భుతం దాన్నో బ్లాక్ బస్టర్ చేసింది. బింబిసార లాంటి బలమైన మాస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ పోటీని తట్టుకుని మరీ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు.

విజయ్ నానిల క్రేజీ మల్టీ స్టారర్ ?

ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత తిరిగి సూపర్ హిట్ క్లాసిక్ తో కంబ్యాక్ ఇవ్వడం ఏ దర్శకుడికైనా చాలా అరుదుగా జరుగుతుంది. పడి పడి లేచే మనసుతో నిజంగానే పడిపోయాడనుకున్న హను రాఘవపూడి సీతారామం రూపంలో ఆవిష్కరించిన అద్భుతం దాన్నో బ్లాక్ బస్టర్ చేసింది. బింబిసార లాంటి బలమైన మాస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ పోటీని తట్టుకుని మరీ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. అందులోనూ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ లతో ఇంత అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించడం మంచి వసూళ్లను రాబడుతోంది. సహజంగానే హను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదనే ఆసక్తి కలగడం సహజం.

ఇద్దరు క్రేజీ హీరోలతో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకునే దిశగా హను ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. న్యాచురల్ స్టార్ నాని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోకు పర్ఫెక్ట్ గా సరిపోయే ఒక ఎంటర్ టైనర్ ని వినిపించబోతున్నట్టు వినికిడి. తన మార్క్ క్లాస్ టచ్ తోనే మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారట. ఎలాగూ సీతారామంలో థ్రిల్ ఇచ్చే అంశాలను హ్యాండిల్ చేసిన తీరుకు పేరొచ్చింది. సో నాని విజయ్ లను బాలన్స్ చేయడం కష్టం కాదు. కాకపోతే ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది. గ్రీన్ సిగ్నల్స్ వచ్చి పట్టాలు ఎక్కేందుకు టైం పట్టొచ్చు. హను రాఘవపూడి ఆల్రెడీ ప్రైమ్ కి ఓ వెబ్ సిరీస్ కి కమిట్ మెంట్ ఇచ్చారట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
Vijay Nanila Crazy Multi Starrer
ఇక నాని విషయానికి వస్తే ప్రస్తుతం తను దసరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడం అభిమానులను ఆందోళన కలిగించింది. దసరా ఫినిష్ అయ్యేదాకా నాని కొత్త సినిమాలు ప్రకటించకపోవచ్చు. విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. పోస్ట్ రిలీజ్ తర్వాత సమంతాతో చేస్తున్న ఖుషి బాలన్స్ పార్ట్ పూర్తి చేయాలి. అది కాగానే పూరి జగన్నాథ్ తో సెకండ్ వెంచర్ జనగణమనని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. ఆపై సుకుమార్ తోనూ ఒక మూవీ ఉంది. మరి హను రాఘవపూడికి ఇద్దరిని కలయిక చేయడం సాధ్యమవుతుందా లేదా వేచి చూడాలి. ఇద్దరూ ఓ నెల దాకా అంత ఈజీగా దొరికే పరిస్థితి లేదు

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş