iDreamPost

గిల్​పై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. అతడు పనికిరాడంటూ..!

  • Author singhj Published - 10:19 PM, Wed - 29 November 23

టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​పై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు కెప్టెన్సీకి పనికిరాడన్నాడు.

టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​పై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు కెప్టెన్సీకి పనికిరాడన్నాడు.

  • Author singhj Published - 10:19 PM, Wed - 29 November 23
గిల్​పై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. అతడు పనికిరాడంటూ..!

ఐపీఎల్-2024 వేలానికి ముందు నిర్వహించిన ప్లేయర్ల రిటెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న హార్దిక్ పాండ్యా అనూహ్యంగా ఆ టీమ్​కు గుడ్ బై చెప్పేశాడు. తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్​కు వెళ్లిపోయాడతను. పాండ్యా కోసం గుజరాత్​కు రూ.15 కోట్లతో పాటు అదనంగా మరికొంత మొత్తాన్ని ముంబై చెల్లించనుందని తెలుస్తోంది. హార్దిక్ చేరిక వల్ల ముంబై బ్యాటింగ్, బౌలింగ్ స్ట్రెంగ్త్ మరింత పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడిగా అతడ్ని ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేస్తున్నారు. రిటెన్షన్ వల్ల లాభపడిన ముంబై హ్యాపీగా ఉంది. కానీ గుజరాత్​కు మాత్రం కొత్త తలనొప్పి మొదలైంది.

హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే అందరూ అనుకున్న విధంగానే యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు సారథ్య బాధ్యతలు దక్కాయి. నిలకడగా రాణిస్తున్న గిల్ గత ఐపీఎల్ సీజన్​లోనూ దుమ్మురేపాడు. దీంతో అతడికే కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది గుజరాత్ యాజమాన్యం. అయితే గిల్​కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని కొందరు సీనియర్ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. అంతగా ఎక్స్​పీరియెన్స్ లేని శుబ్​మన్​కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పి తప్పు చేశారని అంటున్నారు. టీమ్​లో చాలా మంది సీనియర్లు ఉన్నా గిల్​ను కెప్టెన్​గా నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమి రూపంలో ఎంతో అనుభవజ్ఞులైన ప్లేయర్లు టీమ్​లో ఉన్నా గిల్​ను కెప్టెన్​ చేసి గుజరాత్ తప్పు చేసిందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. చాన్నాళ్లుగా న్యూజిలాండ్​ టీమ్​ను కెప్టెన్​గా సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్న కేన్ మామను సారథిని చేస్తే సరిపోయేదని అంటున్నారు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ను కూడా నడిపించిన ఎక్స్​పీరియెన్స్ అతడికి ఉందని గుర్తుచేస్తున్నారు. సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గిల్ కెప్టెన్సీకి పనికిరాడని.. అతడి ప్లేసులో విలియమ్సన్​కు ఆ బాధ్యతలు అప్పజెప్పి ఉంటే బాగుండేదన్నాడు.

‘విలియమ్సన్​ను గుజరాత్ రిటైన్ చేసుకుందని తెలియగానే.. అతడ్నే కెప్టెన్ చేస్తారని అనుకున్నా. అతడు కెప్టెన్​గా ఎంతో అనుభవం ఉన్న ఫెంటాస్టిక్ ప్లేయర్. కానీ గిల్​ను అదృష్టం వరించింది. అయితే శుబ్​మన్​కు ముందుగా భారత క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలోనూ స్థానాన్ని పదిలం చేసుకునే వరకు టైమ్ ఇవ్వాల్సింది. అలాగే ఐపీఎల్​లో అతడు ఇంకో మంచి సీజన్ ఆడే వరకు ఎదురు చూడాల్సింది. విలియమ్సన్​ను కెప్టెన్ చేసే గొప్ప ఛాన్స్​ను గుజరాత్ కోల్పోయింది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. మరి.. గిల్ బదులు కేన్ మామకు కెప్టెన్సీ ఇవ్వాల్సిందంటూ ఏబీడీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: SRHలోకి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ హీరో ట్రావిస్‌ హెడ్‌! కావ్య మాస్టర్‌ ప్లాన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి