టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సెమీస్‌కు ముందు ఒక కొత్త సమస్య వేధిస్తోంది. దీన్ని అతడు ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సెమీస్‌కు ముందు ఒక కొత్త సమస్య వేధిస్తోంది. దీన్ని అతడు ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
వన్డే వరల్డ్ కప్-2023లో ఫేవరెట్స్ నుంచి హాట్ ఫేవరెట్స్‌గా మారిపోయింది టీమిండియా. ఇప్పటిదాకా ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ గెలిచింది. ఇక మిగిలింది రెండు మ్యాచులే. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను అఫీషియల్‌గా సాధించింది కాబట్టి ఆ రెండు మ్యాచుల్లో గెలుపోటములతో పెద్దగా సంబంధం ఉండదు. ఈ మ్యాచుల రిజల్ట్ ఎఫెక్ట్ సెమీస్ బెర్త్‌పై పడదు. కాబట్టి భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏడు మ్యాచులు ఆడినందున విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ల ప్లేస్‌లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ లేదా పిచ్‌ను బట్టి రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించే అవకాశం ఉంది. కానీ విన్నింగ్ ఫ్రీక్‌ను మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంతో అదే టీమ్‌ను కంటిన్యూ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మెగాటోర్నీలో ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచుల్లో భారత బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అదరగొట్టారు. వాళ్ల ఫామ్‌ను చెడగొట్టొద్దనే ఉద్దేశంతో సేమ్ టీమ్‌ను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌లోనూ అందరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆందోళన రేపిన శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు కూడా లంకతో మ్యాచ్‌తో సత్తా చాటారు. సో, టీమ్‌లో ఎవరి ప్లేస్‌ను కూడా టచ్ చేయలేని పరిస్థితి. కానీ గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా గనుక కమ్‌బ్యాక్ ఇస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న పాండ్యా దాదాపుగా కోలుకున్నాడని సమాచారం. సౌతాఫ్రికాతో లేదా నెదర్లాండ్స్‌తో ఆఖరి మ్యాచ్‌కల్లా టీమ్‌తో హార్దిక్ పాండ్యా చేరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే పాండ్యా రాక ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. సూర్యకుమార్‌ను తీసేసి పాండ్యాను తీసుకుందామా అంటే స్కై భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి 49 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో సిరాజ్, షమీల్లో ఎవర్నీ పక్కనపెట్టలేరు. జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.
ఫామ్‌లో లేరనుకున్న శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ రిథమ్‌లోకి వచ్చేశారు. దీంతో పాండ్యా కోసం ఎవర్ని తీసేయాలో తెలియక హిట్‌మ్యాన్ తలపట్టుకుంటున్నాడని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఈ సమస్యను రోహిత్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలని చెబుతున్నారు. అయితే భారత ఫ్యాన్స్ మాత్రం టీమ్‌లో ఒక ప్లేస్ కోసం ఇంత పోటీ ఉండటం చాలా మంచిదని.. మన బెంచ్ స్ట్రెంగ్త్ ఏంటనేది దీంతో తెలిసిపోతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్ ఎదుర్కొంటున్న కొత్త సమస్యకు పరిష్కారం తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరల్డ్ కప్ మ్యాచ్‌కు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడుగా!