iDreamPost

తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీకి ఎన్నికైక ఏకైక మహిళ.. ఆమె ఎవరంటే..?

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ఎనిమిది మందిని ఈ అవార్డులు వరించాయి. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉంది.. ఆమె

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ఎనిమిది మందిని ఈ అవార్డులు వరించాయి. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉంది.. ఆమె

తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీకి ఎన్నికైక ఏకైక మహిళ.. ఆమె ఎవరంటే..?

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో పద్మ అవార్డులు కూడా ఒకటి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తున్నసంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కూడా పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిలను (ఏపీ కేటగిరిలో) రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపిక కాగా, ఐదుగురు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించారు. తెలుగు రాష్ట్రాల నుండి 8 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుండి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.

గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విదలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్ తెలంగాణ వాసులు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి ఒకే ఒక్కరిని పద్మశ్రీ వరించింది. అది కూడా మహిళ కావడం విశేషం. కళా రంగంలో విశేష సేవలు అందించిన డి. ఉమామహేశ్వరికి అవార్డు లభించింది. ఆమె హరికథా కళాకారిణి. ఉమామహేశ్వరి తండ్రి లాలాజీరావు కృష్ణా జిల్లాలోని మచిలీ పట్టణానికి చెందిన నాదస్వర విద్యాంసుడు. వేముల వాడ దేవస్థానంలో 30 ఏళ్ల పాటు నాదస్వరం చేశాడాయన. ఈ నిమిత్తం వీరి కుటుంబం వేముల వాడలో స్థిరపడింది. ఆమె హరికథా నేపథ్యం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోనే ఆరంభమైంది. తండ్రితో కలిసి కళా ప్రదర్శనలకు వెళుతున్న సమయంలోనే ఆమెకు హరికథపై ఆసక్తి కలిగింది. అనంతరం ఆమె కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలలో చేరి, సంస్కృతంలో హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. సంస్కృతంలో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణిగా గుర్తింపు పొందారు.

ఆ తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతంలో చెప్పి.. వారిని విస్మయానికి గురి చేశారమే. బెనారస్ సహా అనేక యూనివర్శిటీల్లో ఆమె హరికథలు చెప్పారు. కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ హరికథలుగా సంస్కృతంలో చెబుతుంటారు. 1993లో అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హర్వార్డ్ యూనివర్శిటీలో కూడా ఆమె హరికథ చెప్పడం విశేషం. కాగా, ఆమె భరత్ కళాకృష్ణ ప్రసిద్ద నాట్యాకారుడు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రదర్శనలిస్తూనే.. ఔత్సాహికులకు ఈ కళను నేర్పిస్తున్నారు. గత ఏడాది ప్రతిష్టాత్మ సంగీత్ నాటక అకాడమీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఆమె. ఇప్పుడు ఆమెను పద్మశ్రీ అవార్డును వరించింది. ఉమామహేశ్వరికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై కపిలేశ్వరపురం ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి