Arjun Suravaram
రైల్వే శాఖకు సంబంధించిన అప్ డేట్స్ కోసం జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఆ శాఖ కూడా కీలకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది. తాజాగా ఏపీ రైలు ప్రయాణికులకు కీలక అలెర్ట్ ప్రకటించింది.
రైల్వే శాఖకు సంబంధించిన అప్ డేట్స్ కోసం జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఆ శాఖ కూడా కీలకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది. తాజాగా ఏపీ రైలు ప్రయాణికులకు కీలక అలెర్ట్ ప్రకటించింది.
Arjun Suravaram
భారత దేశంలో అతి ప్రధాన వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటంతో రైల్లో ప్రయాణిచేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సదుపాయాలను కల్పిస్తుంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఎక్కువ సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అలానే రైల్వేకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా ఆశాఖ చేస్తుంది. ఈ క్రమంలోనే తరచూ ప్రయాణికులకు కీలక సమాచారం అందిస్తుంది. తాజాగా ఏపీలోని పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
రైల్వే శాఖకు సంబంధించిన అప్ డేట్స్ కోసం జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఆ శాఖ కూడా కీలకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది. అదనపు రైళ్లు ఏర్పాటు, రైళ్ల రద్దు వంటి సమాచారం అందిస్తుంది. తాజాగా ఏపీలోని రైలు ప్రయాణికులకు ఈ కీలక అలెర్ట్ ను ప్రకటించింది. గుంటూరు మీదుగా రాయలసీమ వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. అదే విధంగా గుంటూరు మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచి మే26 తేదీ వరకూ ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు.
నరసాపురం ,విజయవాడ మధ్య నడిచే 17270, 07862 రైళ్లన రద్దు చేశారు. అలానే నరసాపురం, రాజమండ్రి మధ్య నడిచే రైళ్లు 07883, 07884 రద్దు చేశారు. నరసాపురం- నిడదవోలు (07897/07771) మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు- నరసాపురం మధ్య నడిచే రైలు నెం.07861 భీమవరం జంక్షన్ వరకే నడుస్తుందని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగానే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విశాఖపట్నం, గుంటూరు మధ్య నడిచే 22701, 22702, 17239 రైళ్లతో పాటూ, రాజమండ్రి, విజయవాడ మధ్య నడిచే 07466, 07467 రైళ్లను రద్దు చేశారు. గుంటూరు,డోన్ మధ్యలో రైల్వే మరమ్మతులు కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. మే 16 నుంచి మే 31 వరకు హుబ్లీ–విజయవాడ (17329) రైలు రద్దైంది. అలాగే ఈ నెల 16 నుంచి 27 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), ఈ నెల 16 నుంచి 31 వరకు నర్సాపురం–గుంటూరు (17282) రైలు రద్దైనట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా మే 17 నుంచి జూన్ 1 వరకు గుంటూరు–నర్సాపురం మధ్య నడితే 17281 రైలును రద్దు చేసినట్లు తెలిపారు. ఇక విజయవాడ నుంచి హుబ్లి నడిచే 17330 రైళ్లు ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు రద్దు చేశారు. ఇక రద్దైన రైళ్ల వివరాలు చూసుకుని ప్రయాణలకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.