iDreamPost

జగన్ మామయ్య అమ్మఒడికి థ్యాంక్స్ – నేనూ డాక్టర్ అవుతా.

జగన్ మామయ్య అమ్మఒడికి థ్యాంక్స్ – నేనూ డాక్టర్ అవుతా.

కర్నూల్ బహిరంగ సభ , సభికుల కన్నా జగన్ కి వీనుల విందైనట్లు ఉంది. జ్యోతిర్మయి అనే చిన్నారి పాప మాట్లాడుతూ . ముఖ్యమంత్రి మామయ్య అని సంభోదించినప్పుడు జగన్ గారి కళ్ళల్లో ఆనందం.

జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిన వైనాన్ని స్పష్టంగా చెప్పింది. డాక్టర్ అవ్వాలని తన ఆశయం అని బీద వాళ్ళైన తన తల్లిదండ్రులు చదివించలేరని భయపడేదాన్నని కానీ ఇప్పుడు నాకా భయం లేదని గతంలో 2005 లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు kgb పాఠశాలలకు పునాది వేశారని , దానితో పాటు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవడి పధకం ద్వారా మా చదువులు ఆటంకం లేకుండా ముందుకు సాగడానికి తోడ్పడుతున్నారు . అలాగే ముఖ్యమంత్రి ని మామయ్యగా సంభోదిస్తూ మరో ముఖ్యమైన కార్యక్రమం నాడు నేడుని ప్రస్తావించింది జ్యోతిర్మయి.

ఈ పధకం ద్వారా ప్రతి పాఠశాలలో వసతుల్ని మెరుగు పరుస్తూ ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా మెరుగు పరిచారని తెలిపింది. అలాగే గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాబోవు కాలంలో పోటీ ప్రపంచంలో కార్పోరేట్ విద్యార్థులకు ధీటుగా రాణించే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక మనం అంతగా ప్రధాన్యమివ్వక తర్వాత బాధపడే కంటి సమస్యల్ని ముందే గుర్తించి వైద్యాన్నిఅందించేందుకు ప్రతి స్కూల్ కి వైద్యుల్ని పంపి విద్యార్థులకు మాత్రమే కాక సమస్యలు ఉన్న తన అవ్వాతాతల వంటి వృద్ధులకు కూడా పరీక్షలు జరిపి మందులు , కళ్ళజోళ్ళు ఉచితంగా అందించినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

తమకు ఉపయోగ పడుతున్న అన్ని పథకాల గురించీ చెప్పే క్రమంలో పిల్లలకి ఇష్టమైన అసలు పథకాన్ని గురించి మర్చిపోయాననుకొందేమో చివర్లో చెప్పింది మిడ్ డే మీల్ గురించి. గతంలో సాధారణంగా ఉండే మిడ్ డే మీల్ ప్రస్తుతం వారంలో ఆరు రోజుల్లో ఆరు రకాలుగా ఆకర్షణీయంగా, రుచికరంగా ఉండటమే కాక తమ పుస్తకాల్లో చదివిన విధంగా పిల్లల ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో ఇష్టంగా తినటానికి వీలుగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.

ఏదేమైనా కర్నూల్ సభ ఓ స్పష్టతని తీసుకొచ్చింది. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తమ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల్ని మెప్పించిన నాయకుల్ని చూసి ఉంటాము కానీ, విద్య , వైద్య , వసతుల కల్పనతో భావి తరపు విద్యార్థి లోకాన్ని కూడా మెప్పించి తన పట్ల ఆకర్షితుల్ని చేసుకొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సంఘటన ద్వార చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి