iDreamPost

Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్, సిల్వర్ కొట్టిన సాత్విక్ సాయిరాజ్, దేశానికే గర్వకారణమన్న ప్రధాని

Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్, సిల్వర్ కొట్టిన సాత్విక్ సాయిరాజ్, దేశానికే గర్వకారణమన్న ప్రధాని

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పసిడి పంట పండింది. మొత్తం 61 పతకాలు పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 బంగారు, 16 వెండి, 23 కాంస్య పతకాలు. మన అమలాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఏకంగా రెండు పతకాలు గెలుచుకున్నాడు. డబుల్స్ ఈవెంట్ లో చిరాగ్ శెట్టితో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. అలాగే టీమ్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ కొట్టాడు. మూడు నెలల కాలంలోనే మూడు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో సాత్విక్ పతకాలు గెలుచుకున్నాడు. మే లో జరిగిన థామస్ కప్ లో సాత్విక్ టీమ్ స్వర్ణం గెలుచుకుంది. ఇప్పుడు కామన్వెల్త్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుచుకుని సాత్విక్ మాంచి ఊపు మీద ఉన్నాడు. టోక్యో ఒలంపిక్స్ లో డబుల్స్ మ్యాచ్ లో సాత్విక్ చిరాగ్ జోడీ వెంట్రుకవాసిలో క్వార్టర్స్ కి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయింది. అయినా కుంగిపోక రెట్టింపు ఉత్సాహంతో ఆడి ఈ ఘన విజయాన్ని నమోదు చేశారు.

ప్రధాన మంత్రి మోడి సాత్విక్, చిరాగ్ శెట్టిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇద్దరూ చక్కటి టీమ్ వర్క్, స్కిల్స్ కనబరిచారని ఆయన కొనియాడారు. స్వర్ణ పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇటు సాత్విక్ తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, రంగమణి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం ఊహించిందేనని కాశీ విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.

సాత్విక్, చిరాగ్ జోడీ ఇండియా నుంచి BWF ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్న మొట్టమొదటి మెన్స్ డబుల్స్ జోడీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి