iDreamPost
android-app
ios-app

తండ్రిని దేవర తెస్తుంటే.. కూతురిని శంకర్ తెస్తున్నాడా?

  • Author ajaykrishna Published - 04:07 PM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 04:07 PM, Tue - 19 September 23
తండ్రిని దేవర తెస్తుంటే.. కూతురిని శంకర్ తెస్తున్నాడా?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వేరని ప్రూవ్ చేసుకుంటుంది. హీరోలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ తప్ప మిగతా మెయిన్ క్యారెక్టర్స్ అన్ని దాదాపు వేరే భాషల నటులే చేస్తున్నారు. ఎక్కువగా మనం హీరోయిన్స్ కోసం, విలన్స్ కోసం తెలుగు మేకర్స్ బాలీవుడ్ వాళ్ళని సంప్రదించడం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఉన్నవాళ్లలో ఎక్కువగా బాలీవుడ్ సరుకు దింపేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒక్క బాలీవుడ్ అని కాదు.. పూరి తన సినిమాలోకి హీరోయిన్స్ ని పక్కాగా బయట నుండే తీసుకొస్తాడని పేరుంది. అంతెందుకు చివరి సినిమా లైగర్ కి కూడా బాలీవుడ్ నుండి అనన్య పాండేని తీసుకొచ్చాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కోసం కూడా బాలీవుడ్ భామనే తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ని.. రామ్ సరసన తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సారా ఆల్రెడీ విజయ్ దేవరకొండతో లైగర్ లోనే డెబ్యూ చేయాల్సింది. కానీ.. కుదరలేదని గతంలో పూరినే స్వయంగా చెప్పాడు. సారాతో జాన్వీని కూడా ట్రై చేశామని తెలిపారు. అప్పట్లో ఎందుకు కుదరలేదో గానీ.. ఇప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ కోసం సారాని తీసుకుంటారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఒకేసారి తెలుగులో డెబ్యూ చేసిన తండ్రీకూతురుగా సారా, సైఫ్ నిలిచిపోతారు.

ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్. కాగా.. విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. దేవర మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరోవైపు వచ్చే ఏడాది మార్చిలో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అని పూరి ప్రకటించిన విషయం విదితమే. ఈ లెక్కన కొరటాల దర్శకత్వంలో తండ్రి సైఫ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూతురు సారా టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయారని ఫ్యాన్స్ అంటున్నారు. సైఫ్ ఇటీవల ఆదిపురుష్ లో రావణ్ గా మెప్పించాడు. మరి సైఫ్, సారా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş