iDreamPost

MS Dhoni: ధోని కళ్లు చెదిరే క్యాచ్.. 42 ఏళ్ల వయసులో చిరుతలా! వీడియో వైరల్..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ వయసులో ఇలాంటి క్యాచ్ పట్టడంతో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ వయసులో ఇలాంటి క్యాచ్ పట్టడంతో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

MS Dhoni: ధోని కళ్లు చెదిరే క్యాచ్.. 42 ఏళ్ల వయసులో చిరుతలా! వీడియో వైరల్..

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించి.. రెండో మ్యాచ్ లో గుజరాత్ ను చిత్తు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 63 పరుగుల తేడాతో గుజరాత్ టీమ్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పట్టిన ఓ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మహేంద్రసింగ్ ధోని-చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో ఈ రెండింటిని విడదీసి చూడలేం. అంతలా చెన్నైకి ధోనికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్ లో కెప్టెన్సీకి విరామం ఇచ్చిన ధోని కీపింగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. మోకాలికి సర్జరీ కావడంతో.. మునుపటిలా కీపింగ్ చేస్తాడా? అన్నఅనుమానం అందరిలో నెలకొంది. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ.. వికెట్ల వెనక చిరుతలా కదులుతూ, బ్యాటర్లకు సింహ స్వప్నంలా మారాడు. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ధోని పట్టిన ఓ క్యాచ్ చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.

Dhoni

ఈ మ్యాచ్ లో ధోని స్పైడర్ మెన్ క్యాచ్ తో మెరిశాడు. 42 ఏళ్ల వయసులో కూడా తన కీపింగ్ తో అభిమానులను అబ్బురపరిచాడు. డార్లి మిచెల్ వేసిన 8వ ఓవర్ లో మూడో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో స్ట్రైకింగ్ లో ఉన్న విజయ్ శంకర్ బంతిని కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు వెళ్లింది. తనకు దూరంగా వెళ్తున్న బంతిని చిరుత పులిలా డైవ్ చేస్తూ.. అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన విజయ్ శంకర్ కంగుతిన్నాడు. ఈ ఏజ్ లో కూడా ఇలాంటి క్యాచ్ ఏంటి సామి? అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

మోకాలికి సర్జరీ కావడంతో.. ధోని గతంలో లాగా కీపింగ్ చేస్తాడా? అని చాలా మంది అన్నారు. కానీ తొలి మ్యాచ్ లో మెరుపు కీపింగ్, ఈ మ్యాచ్ లో చిరుతలా డైవింగ్ చూస్తే.. నీలో ఇంకా పస తగ్గలేదని కితాబిస్తున్నారు నెటిజన్లు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. జట్టులో సాయి సుదర్శన్ 37 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరి పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్న ధోనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: గుజరాత్ చిత్తు.. చెన్నై విజయానికి 5 ప్రధాన కారణాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి