Arjun Suravaram
Arjun Suravaram
ఏపీలో రాజకీయ వాతావరణం బాగా వెడెక్కేంది. గన్నవరం నియోజవర్గంలో పోలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసమే పని చేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని, వైఎస్సార్ బతికి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అయితే యార్లగడ్డ పార్టీకి గుడ్ బై చెప్పడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే నిరాధారణ అయినట్లు కాదని, యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారమే అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.
శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. “ఎవరమైనా పార్టీ కోసం పనిచేయాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి. పార్టీలో ఎవరిని అవమానించడం, బాధించడం అనేది ఉండదు. ఏ పార్టీలోనైనా ఇలాంటి సహజం, అలానే బలమైన వైసీపీ పార్టీలో కూడా ఇలాంటివి మాములే. ఎవరికైన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలే తప్ప.. సమావేశాలు నిర్వహించి..పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు.
గతంలో వైఎస్సార్ సీపీ నుంచి యార్లగడ్డ పోటీ చేశారు. తాజాగా కూడా గన్నవరం నుంటి టికెట్ ఆశించారు. టికెట్ ఆశించే వాళ్లు ఎంతమంది ఉన్నా టికెట్ ఒకరికే వస్తుంది. అదే విషయాన్ని నేను యార్లగడ్డకి చెప్పాను. ఇలా యార్లగడ్డతో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాను. మరోసారి యార్లగడ్డ పార్టీ పెద్దల వద్దకు రావాల్సింది. కానీ పబ్లిక్ గా మీడియాతో మాట్లాడతానంటే ఎలా?. వరుస సమావేశాలు నిర్వహించి.. అలా మాట్లాడుతున్నారు. ముందే పార్టీ మారాలనే ఇలా మాట్లాడుతున్నారేమే అనిపిస్తోంది. సీఎంని కలవాలని ఆయన అనుకుంటే ఒక పద్ధతిలో వెళ్లి కలవచ్చు. లేదా ఇతర ముఖ్యనేతలతో కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు.
అలా కాకుండా మీడియా ద్వారా మాట్లాడటం అనే సరైనది కాదు. యార్లగడ్డను నేను అమానించినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. యార్లగడ్డను పోతేపోనీ అని నేను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అలా నేను.. యార్లగడ్డను ఎందుకు అంటాను. నేనే కాదు వైఎస్సార్ సీపీలో ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేసరు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరి.. యార్లగడ్డ ఎపిసోడ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: MP విజయ సాయి రెడ్డి