iDreamPost

తొలి మూవీ రిలీజ్ కు ముందే లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో కొడుకు! ధరెంతో తెలుసా?

సాధారణంగా రెండు మూడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హీరోలు గానీ, హీరోయిన్లు గానీ లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన ఫస్ట్ మూవీ విడుదల కాకముందే ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వారసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత సంవత్సరం ఖుషీ కపూర్, అగస్త్య నంద, సుహానా ఖాన్ ఇతర నటీ, నటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ లిస్ట్ లోకి ఓ బడా హీరో కొడుకు కూడా వచ్చి చేరాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మెుదటి భార్య కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా డెబ్యూ అవ్వబోతున్నాడు. ఇప్పటికే సారా అలీ ఖాన్ హీరోయిన్ గా రాణిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తన ఫస్ట్ మూవీ ఇంకా విడుదల కాకముందే.. ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇబ్రహీం అలీ ఖాన్.

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘సర్జమీన్’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మెుదటి నుంచి డైరెక్షన్ పై దృష్టిపెట్టిన ఈ స్టార్ కిడ్.. ఇప్పుడు నటనపై ఫోకస్ పెట్టాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే కాస్ట్లీ కారు కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఫస్ట్ మూవీకే ఇబ్రహీం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ డబ్బులతో BMW ఎక్స్ 5 అనే లగ్జరీ కారును కొనుగోలు చేశాడు ఇబ్రహీం. ఇక దీని ధర మార్కెట్ లో రూ. 1.13 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కాగా.. కారు కొన్న సందర్భంగా అతడు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ పాలక్ తివారి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం ఇంటి నుంచి ఆమె బయటకు వచ్చే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే.. ఖరీదైన కారు కొన్న యంగ్ హీరోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి