iDreamPost

క్లిన్ కారా అదృష్టవంతురాలు.. పాప అచ్చం ఆయన పోలికే అంటున్న సాయి తేజ్!

  • Author singhj Published - 08:58 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 08:58 PM, Tue - 25 July 23
క్లిన్ కారా అదృష్టవంతురాలు.. పాప అచ్చం ఆయన పోలికే అంటున్న సాయి తేజ్!

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. పండంటి ఆడబిడ్డకు ఉప్సీ జన్మనిచ్చారు. దీంతో మెగా ఇంట సందడి నెలకొంది. ఈ శుభవార్త తెలియగానే మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు. మెగా ప్రిన్సెస్​కు ఏం పేరు పెడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చెర్రీ-ఉప్సీలు తమ గారాలపట్టికి క్లిన్ కారా అని నామకరణం చేశారు. అయితే చాలా మంది సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీల్లాగే చరణ్ దంపతులు కూడా తమ పాప ముఖాన్ని బయటకు చూపించడం లేదు. బారసాల ఫొటోలతో పాటు మరికొన్ని ఇమేజెస్, వీడియోస్​ను సోషల్ మీడియాలో షేర్ చేసినా తమ కూతురు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు చెర్రీ దంపతులు.

క్లిన్ కారా ఫేస్​ను రివీల్ చేయకపోవడంతో తను ఎలా ఉంది? మెగా ప్రిన్సెస్​కు తాత చిరంజీవి, తండ్రి రామ్ చరణ్ పోలికలు వచ్చాయా? అంటూ ఫ్యాన్స్ చెర్రీ-ఉప్సీ దంపతులను అడుగుతున్నారు. దయచేసి పాప ఫొటోలు షేర్ చేయండంటూ రిక్వెస్ట్​ చేస్తున్నారు. అయితే మెగా ప్రిన్సెస్ గురించి తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాపకు ఎవరి పోలికలు వచ్చాయో కూడా ఆయన చెప్పేశారు. ‘క్లిన్ కారాకు అచ్చం తండ్రి పోలికలే వచ్చాయి. తను రామ్ చరణ్​లాగే ఉంటుంది. కళ్లు మాత్రం చాలా బాగున్నాయి. నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమని అంటారు. క్లిన్ కారా విషయంలోనూ అదే జరిగింది’ అని సాయి తేజ్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘బ్రో’. ఈ మూవీ జులై 28న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇందులో సాయి తేజ్​తో పాటు పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ కూడా కీలక పాత్రలో నటించారు. మెగా కాంబోలో వస్తున్న ఈ మూవీని ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని తెరకెక్కించారు. ‘బ్రో’ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడం విశేషం. కేతికా శర్మ, ప్రియాంకా వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో జరగనుంది. భారీ అంచనాల మధ్య త్వరలో రిలీజ్ కానున్న ‘బ్రో’ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి