iDreamPost

Romantic : సీనియర్ VS జూనియర్ పోటీ : ఇద్దరికీ హిట్టు కావాలి

Romantic : సీనియర్ VS జూనియర్ పోటీ : ఇద్దరికీ హిట్టు కావాలి

ఈ వారం పెద్దగా సినిమాలు లేవు కానీ 29న మరోసారి మంచి బాక్సాఫీస్ పోటీ కనిపించనుంది. నాగ శౌర్య వరుడు కావలెనుతో పాటు ఆకాష్ పూరి రొమాంటిక్ విడుదల కానున్నాయి. నిన్నే రొమాంటిక్ ట్రైలర్ ని ప్రభాస్ తో గ్రాండ్ గా రిలీజ్ చేయించాడు పూరి. చూడగానే ఆహా ఓహో అనిపించలేదు కానీ యూత్ కి ఓ మోస్తరుగా కనెక్ట్ అయ్యే కొన్ని అంశాలు మాత్రం కనిపించాయి. కాకపోతే ఇడియట్ తో మొదలుపెట్టి నేను నా రాక్షసి దాకా హీరోయిజంలో ఉండే రెగ్యులర్ తెంపరితనాన్ని ఇందులో కూడా చూపించారు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో రమ్య కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలక పాత్ర పోషించారు.

ఇక వరుడు కావలెను విషయానికి వస్తే ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా తమన్ కంపోజ్ చేసిన దిగు దిగు నాధాకు హీరోయిన్ రీతూ వర్మ వేసిన గ్లామర్ స్టెప్స్ హైప్ ని పెంచేశాయి. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కనక సరిగ్గా క్లిక్ అయితే లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరహాలో మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. నిజానికి ముందు అనుకున్న 15కే వచ్చి ఉంటే ఇంకా బాగుండేది కానీ డ్రాప్ అవ్వడం ఒకరకంగా మైనస్ అయ్యింది

అదే రోజు కన్నడ డబ్బింగ్ సినిమా జై భజరంగి కూడా వస్తోంది కానీ దాని మీద ఇక్కడ కనీస బజ్ లేకపోవడంతో ఇబ్బందేమీ లేదు. సో ఇప్పుడు పూరి vs నాగ శౌర్యగా మారిపోయింది ఆ రోజు పోటీ. ఆకాష్ తో పోల్చుకుంటే నాగ శౌర్య చాలా సీనియర్. ఆకాష్ కి సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాధ్ కి రొమాంటిక్ హిట్ కావడం చాలా కీలకం. దీని ఫలితం మీదే నెక్స్ట్ వచ్చే చోర్ బజార్ బిజినెస్ ఆధారపడి ఉంది. అటు నాగ శౌర్యకు కూడా హిట్ చాలా అవసరం. ఛలో తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మరి డిఫరెంట్ జానర్స్ లో వస్తున్న వరుడు కావలెను అండ్ రొమాంటిక్ లో విన్నర్ ఎవరు కాబోతున్నారో

Also Read : Agent : సూపర్ కాంబో సెట్ చేసుకున్న సూరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి