Agent : సూపర్ కాంబో సెట్ చేసుకున్న సూరి

By iDream Post Oct. 20, 2021, 10:45 am IST
Agent : సూపర్ కాంబో సెట్ చేసుకున్న సూరి

ఇటీవలే విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మొదటి హిట్టు అందుకున్న అఖిల్ ఫోకస్ ఇకపై ఏజెంట్ పై ఉండనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి కరోనాకు ముందు డిసెంబర్ విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టి 2022 వేసవికి ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ మీద సూరి చాలా కాలం నుంచే వర్క్ చేస్తున్నాడు. కష్టపడి చేసిన సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో దీని మీద బాగా కసిగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా చాలా కీలకమైన పాత్రకు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని గతంలో సంప్రదించినట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఒప్పుకోలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మలయాళం మెగాస్టార్ ,మమ్ముట్టి ఇప్పుడా క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే కోలీవుడ్ పిఆర్ఓ శ్రీధర్ పిళ్ళై వేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి పాత్ర చాలా పవర్ ఫుల్ గ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అధికారిక ప్రకటన రావలసి ఉంది.

మమ్ముట్టి చివరిగా కనిపించిన తెలుగు సినిమా యాత్ర. అందులో డాక్టర్ వైఎస్ఆర్ గా మెప్పించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతకు ముందు దశాబ్దాల క్రితం సూర్య పుత్రులు, స్వాతి కిరణం లాంటి సెలెక్టెడ్ మూవీస్ తప్ప ఈయన తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు లేవు. ఎంత కష్టమైనా సరే ప్రతి భాషలోనూ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే మమ్ముట్టి ఇప్పుడు ఏజెంట్ కి ప్రత్యేక ఆకర్షణ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఏజెంట్ వివిధ దేశాల్లో షూట్ జరుపుకోనుంది. షాడో తరహా గూఢచారి పాత్రలో అఖిల్ ని ఫ్యాన్స్ ఊహించని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్

Also Read : Akhil Akkineni : సోషల్ మీడియా పవర్ చూపించిన 'అయ్యగారు'

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp