iDreamPost

నటిగా ఫెయిల్‌ అయితే అది నా తప్పు.. కానీ.. కేతిక శర్మ

ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా.. సోషల్‌ మీడియాలోనూ ఆమెకు సినిమా వైఫల్యాల గురించే ప్రశ్న ఎదురవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, సినిమా ఫెయిల్యూర్స్‌పై కేతిక శర్మ స్పందించారు.

ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా.. సోషల్‌ మీడియాలోనూ ఆమెకు సినిమా వైఫల్యాల గురించే ప్రశ్న ఎదురవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, సినిమా ఫెయిల్యూర్స్‌పై కేతిక శర్మ స్పందించారు.

నటిగా ఫెయిల్‌ అయితే అది నా తప్పు.. కానీ.. కేతిక శర్మ

రొమాంటిక్‌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు కేతిక శర్మ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడేళ్లు అవుతున్నా ఆమె కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశారు. 2021లో వచ్చిన ‘‘రొమాంటిక్‌’’ డెబ్యూ సినిమా కాగా.. అదే సంవత్సరం ఆమె నటించిన రెండో సినిమా ‘‘లక్ష్య’’ విడుదలైంది. తర్వాత 2022లో మెగా కాంపౌండ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’సినిమా చేశారు. తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ – సాయి ధరమ్‌ తేజ్‌ల సినిమా ‘‘బ్రో’’లో నటించారు. అయితే, ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ఆమె నటించిన నాలుగు సినిమాల్లో ఒక్కటి కూడా హిట్టు కాకపోవటం గమనార్హం.

ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా.. సోషల్‌ మీడియాలోనూ ఆమెకు సినిమా వైఫల్యాల గురించే ప్రశ్న ఎదురవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, సినిమా ఫెయిల్యూర్స్‌పై కేతిక శర్మ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. తన సినిమాలు ఆడకపోతే తన బాధ్యత ఎలా అవుతుందని అన్నారు. తన వరకూ తాను ఫుల్‌ ఎఫర్ట్స్‌ పెడుతున్నానని చెప్పారు. తాను నటిగా ఫెయిల్‌ అయితే అప్పుడు తన బాధ్యత అవుతుందని అన్నారు. సినిమాలకు అతీతంగా తనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని, అది చాలని అన్నారు.

పనిచేసుకుంటూ పోవటమే తనకు తెలుసునని, ఇక సక్సెస్‌ కాస్త లేటైనా అదే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికి వరుస సినిమా వైఫల్యాలు ఆమె సినీ కెరీర్‌పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఆమెకు సరైన అవకాశాలు లేవు. సరైన కథలను ఎంచుకోకపోవటం వల్లే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ నడుస్తోంది. మరి, సినిమా ఫెయిల్యూర్స్‌తో తనకు సంబంధం లేదంటున్న కేతిక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి