iDreamPost

ఈ ఫోటోలోని చిన్నోడు.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్.. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబును చూశారా..? ఎంత ముద్దుగా ఉన్నాడో కదూ. ఇప్పుడు అతడో హ్యాండ్సమ్ బాయ్. తెలుగులో ఫ్యామిలీ, యాక్షన్, లవ్ స్టోరీస్ అందించిన ఈ కుర్ర హీరో.. మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబును చూశారా..? ఎంత ముద్దుగా ఉన్నాడో కదూ. ఇప్పుడు అతడో హ్యాండ్సమ్ బాయ్. తెలుగులో ఫ్యామిలీ, యాక్షన్, లవ్ స్టోరీస్ అందించిన ఈ కుర్ర హీరో.. మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలోని చిన్నోడు.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్.. ఎవరో గుర్తు పట్టారా..?

సినిమా అంటే ఫ్యాషన్, పిచ్చితో చాలా మంది కుర్రాళ్లు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఒక్క ఛాన్సైనా రాకపోతుందా.. తనను తాను ప్రూవ్ చేసుకోకపోతానా అన్న ధైర్యం.. వారిని అవకాశాల కోసం కాళ్లు అరిగేలా చేస్తుంది. చిన్న అవకాశం వచ్చినా.. వదిలిపెట్టరు. కొత్త వారితో బడా దర్శకులు, హీరోలు సినిమాలు రిస్క్ చేయరు. సో వీరి స్టోరీ నచ్చి.. కొంత మంది ధైర్యంగా పెట్టుబడి పెడుతుంటారు. సినిమా థియేటర్లలో రిలీజయ్యేంత వరకు టెన్షన్ ఉంటుంది కుర్ర హీరోలో. సినిమా హిట్ అయ్యిందా.. ఇక వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా చిన్న సినిమాల ద్వారా పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన టాలెండెట్ కుర్రాళ్లు ఎంతో మంది టీటౌన్‌లో ఉన్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని చూశారు కదా.. అతడు కూడా ఈ కోవలేకే వస్తాడు. తన అందంతో అమాయకత్వంతో కట్టిపడేస్తున్న ఈ చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హంక్. హైట్ కు తగ్గ వెయిట్.. అందగాడు.. అబ్బాయి యాక్టింగ్‌లో మంచి ఫైర్ కూడా ఉంది. ఇండస్ట్రీకి మంచి హిట్సే అందించాడు.. కానీ ఎక్కడో తడబడుతున్నాడు. ఒక హిట్ ఇస్తే.. మూడు, నాలుగు ప్లాపులు ఇస్తున్నాడు. ఇంత వివరణ ఇచ్చాక.. హీరో పేరు చెప్పకుండా.. సినిమా చెబితే బాగోదు కనుక.. చెప్పేస్తున్నాం. ఆ క్యూట్ గయ్ పేరు నాగ శౌర్య. అందరికీ నాగ శౌర్య అనగానే ఊహాలు గుసగుసలాడే మూవీయే గుర్తుకు వస్తుంది కానీ.. అంతకన్నా ముందే క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్స్ అనే చిత్రంలో నటించాడు ఈ ఏలూరు కుర్రాడు.

చందమామ కథలు తర్వాతే.. సింగిల్ హీరోగా ఊహాలు గుసగుసలాడేతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మరో హ్యాండ్సమ్ హీరో దొరికేశాడనుకున్నారంతా. అనుకున్నట్లుగానే మంచి కథలు చేశాడు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయి ప్రేమలో పడితే..కాన్సెప్టే కొత్తగా ఉంది కదా.. ఇదే దిక్కులు చూడకు రామయ్యా మూవీ. లక్ష్మి రావే మా ఇంటికి, జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి బెడిసి కొట్టాయి. కానీ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగం ఓకే అనిపించింది. ఒక మనసు మూవీతో మంచి మార్కులు పడ్డాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన జ్యో అచ్యుతానంద సినిమా హిట్ అందుకుంది.

ఇక తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తన తల్లితో కలిసి ఛలో అనే మూవీ నిర్మించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో అతి పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. నేషనల్ క్రష్‌గా అవతరించడానికి రష్మిక మందన్నకు పునాదిగా మారిందీ చిత్రం. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మెప్పించలేదు. ఓ బేబితో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆ క్రెడిట్ హీరోయిన్‌కు వెళ్లిపోయింది. అశ్వద్ధామ అనే సినిమా చేయగా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇటీవల రంగ బలి అంటూ వచ్చినా.. థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించలేకపోయింది. కొత్త కథలు, కాన్సెప్టులు ఎంచుకున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ పడటం లేదు. ఇపపుడు మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. 2022లో ఓ ఇంటి వాడయ్యాడు శౌర్య. ప్రస్తుతం అతడి తల్లి ఉషా ముల్పూరి.. హైదరాబాద్ లో తన పేరు మీద రెస్టారెంట్ నడుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి