Nidhan
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే వారికో గుడ్ న్యూస్.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే వారికో గుడ్ న్యూస్.
Nidhan
రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చేది అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్. అయితే బ్యాటింగే కాదు.. కెప్టెన్సీలోనూ అతడు ఎంతో పేరు గడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న హిట్‌మ్యాన్.. అక్కడి కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సారథిగా ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లుగా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడతను. ఈ 10 సంవత్సరాల్లో ఆ ఫ్రాంచైజీకి ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు రోహిత్. అలాంటి గ్రేట్ కెప్టెన్‌ను ముంబై అవమానించింది. హిట్‌మ్యాన్ ప్లేస్‌లో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమిచింది. గౌరవప్రదంగా కాకుండా తమ డెసిజన్ ఫైనల్ అనేలా అవమానకరంగా రోహిత్‌ను తప్పించడంపై ముంబై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హిట్‌మ్యాన్‌ను అర్ధాంతరంగా తీసేయడంతో అతడి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అయితే తీవ్ర బాధలో ఉన్న రోహిత్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో నిరాశలో ఉన్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఫస్ట్ ఛాయిస్ రోహితేనని భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ హిట్‌మ్యాన్ ఓకే అంటే అతడికే సారథ్యం దక్కుతుందని బీసీసీఐ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ముంబై కెప్టెన్సీని హఠాత్తుగా వచ్చి ఎగరేసుకుపోయిన హార్దిక్ పాండ్యాకు భారత టీ20 జట్టు పగ్గాలు కూడా అప్పజెబుతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంజ్యురీ నుంచి కోలుకున్నాక అతడ్ని కెప్టెన్‌గా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలో రోహిత్ ఓకే అంటే చాలు కెప్టెన్సీ అతడికే ఇస్తారంటూ బీసీసీఐ వర్గాలు చెప్పడం అతడి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. అయితే దీనికి రోహిత్ ఒప్పుకునే ఛాన్స్ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వరల్డ్ కప్-2022 తర్వాత నుంచి భారత టీ20 టీమ్‌కు హిట్‌మ్యాన్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. కేవలం వన్డేలు, టెస్టుల్లోనూ కంటిన్యూ అవుతున్నాడు.
వన్డేల్లో చిరకాల ప్రపంచ కప్ నెగ్గాలనే ఉద్దేశంతో పూర్తిగా దాని మీదే ఫోకస్ చేశాడు. అందుకోసం బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. కానీ మెగా టోర్నీలో అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు చేరుకున్న రోహిత్ సేన.. తుదిమెట్టుపై చతికిలపడి కప్పును చేజార్చుకుంది. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ పోస్టు నుంచి ముంబై తీసేయడం మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో తక్కువ గ్యాప్‌లోనే జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమ్‌ను లీడ్ చేసేందుకు అతడు ఒప్పుకుంటాడా? లేదా కెప్టెన్సీ బాధ్యతలను ఇంకొకరికి అప్పజెబుతాడా? అనేది త్వరలో తేలనుంది. కానీ ముంబైలా కాకుండా కెప్టెన్సీ అంశాన్ని రోహిత్‌కే వదిలేయాలని అనుకున్న బీసీసీఐని మెచ్చుకోక తప్పదు. మరి.. రోహిత్ ఓకే అంటే అతడికే కెప్టెన్సీ అని బీసీసీఐ వర్గాలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: హార్దిక్‌ను ఊరికే కెప్టెన్ చేయలేదు.. ఆ 5 కారణాల వల్లే అతడికి ముంబై సారథ్యం!
BCCI official confirms#bcci #TeamIndia #RohitSharma𓃵 pic.twitter.com/8KlzDk1rsY
— Cricket Addictor (@AddictorCricket) December 17, 2023