iDreamPost

Hardik Pandya: హార్దిక్​ను ఊరికే కెప్టెన్ చేయలేదు.. ఆ 5 కారణాల వల్లే అతడికి ముంబై సారథ్యం!

  • Published Dec 16, 2023 | 7:28 PMUpdated Dec 16, 2023 | 7:28 PM

హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంఐ రాంగ్ డెసిజన్ తీసుకుందని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే హార్దిక్​కు ఉన్న క్యాపబిలిటీస్​ను నమ్మే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వెనుక 5 కారణాలు కనిపిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంఐ రాంగ్ డెసిజన్ తీసుకుందని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే హార్దిక్​కు ఉన్న క్యాపబిలిటీస్​ను నమ్మే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వెనుక 5 కారణాలు కనిపిస్తున్నాయి.

  • Published Dec 16, 2023 | 7:28 PMUpdated Dec 16, 2023 | 7:28 PM
Hardik Pandya: హార్దిక్​ను ఊరికే కెప్టెన్ చేయలేదు.. ఆ 5 కారణాల వల్లే అతడికి ముంబై సారథ్యం!

ఐపీఎల్​లో అత్యంత సక్సెస్​ఫుల్ టీమ్స్​లో ముంబై ఇండియన్స్ ఒకటి. అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్​తో కలసి ఉమ్మడిగా నంబర్​వన్ ప్లేసులో కంటిన్యూ అవుతోంది. ఐదు సార్లు మెగా లీగ్​లో ఛాంపియన్​గా నిలిచిన ముంబైకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. గేమ్, ట్యాక్టిక్స్, ప్లానింగ్ విషయంలో ఆ టీమ్​కు తిరుగుండదు. అలాంటి జట్టును కెప్టెన్​గా ముందుండి నడిపే ఛాన్స్​ను కొట్టేశాడు స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా. వచ్చే సీజన్ కోసం హార్దిక్​ను ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా నియమించారు. అయితే అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ హార్దిక్​ ఊరికే కెప్టెన్ అయిపోలేదని గమనించాలి. ముంబై సారథ్యం అతడికి దక్కడానికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్​ను ముందుకు తీసుకెళ్లే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉందని నమ్మడం వల్లే అతడ్ని ప్లేయర్ల రిటెన్షన్​లో దక్కించుకుంది ముంబై ఇండియన్స్. అతడి కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడమే గాక కామెరూన్ గ్రీన్ లాంటి స్టార్ క్రికెటర్​ను వదులుకుంది. గుజరాత్​ టైటాన్స్​ను ఒప్పించి మరీ పాండ్యాను తమ టీమ్​లోకి తెచ్చుకుంది. దీన్ని బట్టే అతడి విషయంలో ముంబై ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జస్​ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఇతర సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ హార్దిక్​నే కెప్టెన్​ చేయడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హార్దిక్​ను కెప్టెన్ చేయడానికి ప్రధాన కారణాల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్​గా సక్సెస్ అవడం ఒకటి. గత రెండు సీజన్లలో గుజరాత్​ను సారథిగా విజయవంతంగా నడిపించాడీ స్టార్ ఆల్​రౌండర్.

ఒక సీజన్​లో టీమ్​కు టైటిల్ అందించిన హార్దిక్.. మరో సీజన్​లో జట్టును ఫైనల్స్​కు చేర్చాడు. పాండ్యాకు ముంబై సారథ్యం దక్కడానికి మరో కారణం అతడి టాలెంట్. ప్లేయర్​గా హార్దిక్​కు వంక పెట్టడానికి లేదు. అతడి ఆల్​రౌండ్ ఎబిలిటీస్​ ముంబైకి నచ్చింది. ఇంకో కారణం ఎంఐకి గతంలో ఆడటం. అక్కడి ఎన్విరాన్​మెంట్ ఎలా ఉంటుందో అతడి పూర్తిగా తెలియడం. గుజరాత్ తనకు కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసినా ముంబైని మర్చిపోకపోవడం, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఎంఐ వల్లే కాబట్టి పిలవగానే వచ్చేయడం కూడా మరో కారణమని చెప్పాలి. పాండ్యా లాయల్టీగా బిహేవ్ చేయడం కూడా ముంబై యాజమాన్యానికి నచ్చింది. ఆఖరి కారణంగా హార్దిక్ అగ్రెషన్​ను చెప్పొచ్చు. ఒక ఆటగాడిగా, కెప్టెన్​గా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు పాండ్యా. ఇది కూడా ఎంఐ ఓనర్స్​ను ఇంప్రెస్ చేసింది. ఈ కారణాల వల్లే తరచూ గాయాలబారిన పడతాడనే భయం ఉన్నా లెక్కచేయకుండా హార్దిక్​ను కెప్టెన్ చేసింది ముంబై. మరి.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Jasprit Bumrah: హార్దిక్ ఎఫెక్ట్.. ముంబైకి గుడ్ బై చెప్పనున్న బుమ్రా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి