iDreamPost
android-app
ios-app

ఖుషి మూవీ రివ్యూ!

ఖుషి మూవీ రివ్యూ!

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా ‘ఖుషి’. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు బిగ్ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో ప్రేక్షకుల అటెన్షన్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. విజయ్ – సామ్ ల కెమిస్ట్రీ పరంగా అంచనాలు క్రియేట్ చేసింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్, రిఫ్రెషింగ్ విజువల్స్ తో పాటు విప్లవ్ – ఆరాధ్యల స్క్రీన్ ప్రజెన్స్ జనాలలో ఆసక్తి కలిగించాయి. మరి.. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఖుషి మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

ఖుషి కథ కాశ్మీర్ లో స్టార్ట్ అవుతుంది. విప్లవ్(విజయ్ దేవరకొండ) తొలిచూపులోనే బేగం(సమంత)ని లవ్ చేస్తాడు. ఎలాగైనా ఆమెను ప్రేమలో పడేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో బురఖాలో ఉన్న బేగం ముస్లిం కాదని.. ఆమె పేరు ఆరాధ్య, బ్రాహ్మిణ్ అని షాకింగ్ న్యూస్ విప్లవ్ కి తెలుస్తుంది. అసలు ఆరాధ్య ఎందుకు బేగం మారిందో తెలుసుకునే ప్రాసెస్ లో ఆమె ప్రేమను పొందుతాడు విప్లవ్. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.. విప్లవ్ ఫ్యామిలీ నాస్తికులు కావడంతో సంబంధం ఓకే చేయడానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవు. దీంతో పెద్దలను ఎదురించి మరీ ఆరాధ్య – విప్లవ్ పెళ్లి చేసుకుంటారు. అక్కడినుండి వీరి లైఫ్ ఎలా సాగింది? పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు? వాటిని దాటుకుని లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఖుషి మూవీ కథ.

విశ్లేషణ:

ఓ అందమైన జంట. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరుగా ఉంటారు. కానీ.., పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బ తింటుంది. అలాంటి స్థితిని కూడా దాటి ఆ జంట ఎలా తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు? ఇలాంటి కథ తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్త కాదు. ఇప్పటికే ఓ డజను సినిమాలు ఇలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఖుషి కూడా అచ్చం ఇలాంటి సినిమానే. కానీ.., ఓ పాత టెంప్లేట్ లైన్ కి.. కొన్ని ఎమోషనల్ సీన్స్ జోడించి కూడా అద్భుతం చేయొచ్చు అని శివ నిర్వాణ ఖుషితో ప్రూవ్ చేశాడు. కానీ.. 3 ఎమోషనల్ సీన్స్ కోసం.. 3 గంటల సినిమాని ప్రేక్షకుడు ఓపిగ్గా చూడాల్సి రావడం ఖుషి మైనస్. శివ ముందు సినిమాలైన నిన్నికోరి, మజిలీ సినిమాల్లో లవ్ సీన్స్ లో ఓ ఫ్రెష్ నెస్ ఉంటుంది. ఇక్కడే దర్శకుడిగా శివకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ.., ఖుషిలో మాత్రం లవ్ ట్రాక్ గాడి తప్పింది. తాను చెప్పాలి అనుకున్న కథ అంతా సెకండ్ ఆఫ్ లో ఉంది కాబట్టి.. ఆ లవ్ ట్రాక్ నిడివి ఏమైనా తక్కువ పెట్టాడా అంటే అదీ లేదు. కాకుంటే.. విజయ్- సామ్ స్క్రీన్ ప్రజెన్స్ ఈ లవ్ ట్రాక్ ఒడ్డున పడటానికి పెద్ద ఎసెట్ అయ్యింది.

సెకండ్ ఆఫ్ లో అసలు కథ స్టార్ట్ కావడంతో ఖుషి మూవీ ట్రాక్ లో పడుతుంది. అక్కడ నుండి దర్శకుడిగా కూడా శివ నిర్వాణ బెస్ట్ వర్క్ కనపరిచాడు. పెళ్లి అయ్యాక వచ్చే చిన్న చిన్న స్పర్ధలను సున్నితంగా చూపిస్తూ, పెద్దల ఎమోషన్ ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఇలా ప్రీ క్లైమ్యాక్స్ వరకు ఖుషీ మూవీ సజావుగా సాగిపోతుంది. కానీ.., క్లైమ్యాక్స్ లో ఎలాంటి మెరుపులు లేకపోవడం, మంచి ఇంప్యాక్ట్ ఇచ్చే సన్నివేశం పడకుండానే క్యారెక్టర్స్ బిహేవియర్ ఒక్కసారిగా మారిపోవడం సగటు ప్రేక్షకులకి రుచించకపోవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఖుషీ మూవీకి రన్ టైమ్ పెద్ద శాపంగా మారింది. నిడివి ఎక్కువ కావడంతో దర్శకుడు చెప్పాలనుకున్న కథలో వేగం లేకుండా పోయింది. మూవీని సరిగ్గా ట్రిమ్ చేసి ఉంటే.. ఖుషి స్థాయి మరో లెవల్ లో ఉండేది. కాకుంటే.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఇలాంటిఓ చిత్రం తెలుగులో వచ్చి చాలా కాలం అయ్యింది. ఎలాంటి వల్గారిటీ లేకుండా.. దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథని సిన్సియర్ గా చెప్పడమే ఖుషికి ఇప్పుడు బలం అయ్యింది.

నటీనటుల పనితీరు:

నటనలో విజయ్ దేవరకొండ ఓ పవర్ హౌస్ లాంటోడు. అర్జున్ రెడ్డి లాంటి పాత్రలో చేసిన విజయ్.. పెళ్లి చూపులు, గీతాగోవిందం వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. కాకుంటే.. ఈ మధ్య కాలంలో రౌడీ హీరోని సరిగ్గా వాడుకోవడం దర్శకులు విఫలం అవుతూ వచ్చారు. కానీ.., ఇందులో మాత్రం విజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. అగ్రెసివ్ నెస్ కనిపించకుండా. ఓ సెటిల్డ్ టైమింగ్ తో విజయ నటించిన తీరుని అభినందించకుండా ఉండలేము. ఇక ఆరాధ్య పాత్రలో సామ్ పరకాయ ప్రవేశం చేసేసింది. ఆమె నటనలో నిజాయతీ కనిపించింది. వీరిద్దరి నటన, స్క్రీన్ ప్రజెన్స్ మాత్రమే ఖుషి మూవీకి మేజర్ అసెట్స్ అయ్యాయి. ఇక మురళీశర్మ, సచిన్ ఖేడేకర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీనియర్ నటి లక్ష్మీ పాత్ర పరిధి చిన్నదే అయినా.. తన అనుభవాన్ని రంగరించి నటించింది. మిగిలిన పాత్రల నుండి కూడా దర్శకుడు చక్కని నటన రాబట్టుకోగలిగాడు.

టెక్నికల్ విభాగం:

ఖుషి మూవీలోని టెక్నీషయన్స్ గురించి చెప్పుకోవాలంటే.. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత మంచి రీ ఫ్రెషింగ్ సాంగ్స్ రాలేదు. ఓ రకంగా హేషమ్ అబ్దుల్ వాహబ్ రూపంలో టాలీవుడ్ కి ఓ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికినట్టే. 2012లో వచ్చిన అందాల రాక్షసి మూవీకి సినిమాటోగ్రఫీ చేసిన మురళి.. మళ్లీ తెలుగులో కనిపించలేదు. తమిళ్ లో బిజీగా ఉన్న మురళిని ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ తీసుకుని శివ నిర్వాణ మంచి పని చేశాడు. విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా మురళి లైటింగ్ వాడుకున్న తీరు అద్భుతం. ఎడిటర్ ఈ మూవీపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా ఓకే అనిపించుకున్న శివ.. రచయతగా సన్నివేశాల్లో ఇంకాస్త కొత్తదనాన్ని నింపి ఉంటే బాగుండేది.

బలాలు:

  • విజయ్ దేవరకొండ
  • సమంత
  • మ్యూజిక్
  • కెమెరా

బలహీనతలు:

  • కథ
  • నిడివి
  • స్లో ప్రజెంటేషన్
  • క్లైమ్యాక్స్

చివరిమాట: ఖుషి.. కొంతమేరే

రేటింగ్: 2.25

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి