ajaykrishna
ajaykrishna
ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ల తర్వాత దర్శకద్వయం రాజ్ & డీకే కొత్త సిరీస్ తో ముందుకొచ్చారు. ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ వెబ్ సిరీస్.. తాజాగా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ లో దుల్కర్ సల్మాన్, రాజ్ కుమార్ రావు, శ్రేయ ధన్వాంతరి, గుల్షన్ దేవయ్య, సతీష్ కౌశిక్, ఆదర్శ్ గౌరవ్ ప్రధానపాత్రలు పోషించారు. మరి 90ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన.. ఈ డార్క్ కామెడీ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
ఈ వెబ్ సిరీస్ కథ 90ల కాలంలో జరుగుతుంది.. పన్నా టిప్పు (రాజ్‌కుమార్ రావు), అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్), ఛోటా గాంచీ (ఆదర్శ్ గౌరవ్) ఇంకా ఫోర్ కట్ ఆత్మారామ్ (గుల్షన్ దేవయ్య) అనే నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. పన్నా టిప్పు బైక్ మెకానిక్.. ఓ టీచర్ ని లవ్ చేస్తుంటాడు. అర్జున్ వర్మ ఓ పోలీస్ ఆఫీసర్. ఆ టైంలో ఇద్దరు బడా గ్యాంగ్ స్టర్స్ మధ్య వార్ మొదలవుతుంది. దీంతో పోలీస్ అర్జున్ వర్మ ఎంట్రీ ఎంటర్ అవుతాడు. అయితే.. ఈ కేసులో నిజాయితీ చూపకుండా డబ్బులు వెనకేసుకోవాలని చూస్తాడు అర్జున్ వర్మ. అప్పుడు కథలో అసలు ట్విస్టులు మొదలవుతాయి. మెయిన్ క్యారెక్టర్స్ నలుగురు లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చివరికి పన్నా, అర్జున్, ఆత్మరామ్, చోట గాంచిలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
కామెడీతో కూడిన సినిమాలైనా.. వెబ్ సిరీస్ లైనా ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే.. కథలో ఎంత సీరియస్ నెస్ ఉన్నా.. ఆఖరికి ఎంటర్టైన్మెంట్ ఫన్ కూడా ఉండాల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ ల తర్వాత డైరెక్టర్స్ రాజ్, డీకే.. ఈ “గన్స్ అండ్ గులాబ్స్” సిరీస్ తీసుకొచ్చారు. ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.. సిరీస్ నిండా చాలా ట్విస్టులు.. టర్నింగ్ పాయింట్స్ తో పాటు ఫుల్ ఫన్ కూడా ఉందని. సిరీస్ లలో కూడా కొత్తదనం కోరుకుంటున్న ఓటిటి లవర్స్ కి గన్స్ అండ్ గులాబ్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇలాంటి డార్క్ కామెడీ సిరీస్ లు అరుదుగా వస్తుంటాయి.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్.. ఆద్యంతం ఫన్.. గ్యాంగస్టర్స్.. లవ్ ట్రాక్.. డ్రగ్స్.. ఇంకా గన్స్ చుట్టూ సాగుతుంది. అసలు ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా స్క్రీన్ ప్లే పరుగులు తీస్తుంటుంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్.. ఒక్కో ఎపిసోడ్ ముగుస్తున్నకొద్దీ ఆసక్తి రేపుతూ సాగింది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ కాస్త స్లో అనిపిస్తుంది. కానీ.. ఎక్కడా ఫన్ మిస్ కాకుండా సాగిందని చెప్పాలి. దర్శకులు ఫన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ సిరీస్ అంటే తెలిసిందే కదా.. డైలాగ్స్ లో బోల్డ్ పదాలు వస్తూనే ఉంటాయి. ఇందులో కూడా అలాంటి పదప్రయోగాలు చాలా చేశారు.
క్లైమాక్స్ కి వచ్చేసరికి.. ఇంటరెస్టింగ్ ట్విస్టులతో.. దీనికి కంటిన్యూ సిరీస్ కూడా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎందుకంటే.. ఇది సీజన్ 1. నాలుగు ప్రధాన పాత్రలున్న ఈ సిరీస్ లో ప్రతి నటుడు తమ తమ బెస్ట్ ఇచ్చారు. రాజ్‌కుమార్ రావ్.. దుల్కర్ సల్మాన్.. గుల్షన్ దేవయ్య.. ఛోటా గాంచిగా ఆదర్శ్ గౌరవ్ అందరూ తమ పాత్రలలో లీనమైపోయారు. అయితే.. ఈ సిరీస్ లో నటించిన సతీష్ కౌశిక్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక టెక్నికల్ గా.. రాజ్, డికె ఈ సిరీస్ కి కాస్టింగ్ తోనే అందం తెచ్చారు. రాజ్ డీకే రాసుకున్న కథకు.. సుమిత్ అరోరా మాటలు రాసారు. కునాల్ మెహతా స్క్రీన్ ప్లే బాగుంది. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యాయి. గన్స్ అండ్ గులాబ్స్ ఖచ్చితంగా 90స్ కాలాన్ని గుర్తు చేస్తుంది.
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)