iDreamPost

లోన్‌ తీసుకున్న వారు చనిపోతే డబ్బులు కట్టక్కర్లేదు.. పైగా మరో రూ.10 లక్షలు ఇస్తారు

  • Published Jun 17, 2024 | 1:14 PMUpdated Jun 17, 2024 | 1:14 PM

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్‌ తీసుకున్న వారు మృతి చెందితే.. ఆ మొత్తం చెల్లించాల్సిన పని లేదు. పైగా అదనంగా ప్రభుత్వమే మరో 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆ వివరాలు..

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్‌ తీసుకున్న వారు మృతి చెందితే.. ఆ మొత్తం చెల్లించాల్సిన పని లేదు. పైగా అదనంగా ప్రభుత్వమే మరో 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 1:14 PMUpdated Jun 17, 2024 | 1:14 PM
లోన్‌ తీసుకున్న వారు చనిపోతే డబ్బులు కట్టక్కర్లేదు.. పైగా మరో రూ.10 లక్షలు ఇస్తారు

నేటి కాలంలో లోన్‌ అనేది అత్యవసరంగా మారింది. ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాక.. ఇంటి వద్ద ఉండే మహిళలు, రైతులకు కూడా లోన్‌లు ఇస్తారు. ఇలా తీసుకున్న రుణాలను సరిగా చెల్లిస్తే.. పాత లోన్‌ తీరగానే.. కొత్తగా మరికొంత నగదు పెంచి కొత్త రుణాలు కూడా మంజూరు చేస్తారు. బ్యాంకుల నుంచి లోన్‌లు పొందే వారిలో స్వయం సహాయక సంఘాలు ముందు స్థానంలో ఉంటాయి. ప్రతి నెల కచ్చితంగా డబ్బులు చెల్లిస్తూ.. చెప్పిన సమయంలోపు రుణాల చెల్లింపు పూర్తి చేస్తారు. అందుకే బ్యాంకులు, ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు ఎక్కువ మొత్తంలో రుణ సదుపాయం, ఇతర అనేక ప్రయోజనాలు కల్పిస్తాయి. ఇదిలా ఉంటే లోన్‌ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ తర్వాత ఏం చేయాలి.. దాన్ని ఎవరు కడతారు అనే అంశాలపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న రేవంత్‌ సర్కార్‌.. తాజాగా స్వయం సహాయక సంఘాల మహిళలకు శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక బీమా సౌకర్యం తీసుకువచ్చింది. దీని ద్వారా లోన్‌ తీసుకున్న మహిళ మృతి చెందితే.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే పనిలేదు. పైగా మరణించిన లబ్ధిదారు పేరు మీద మరో 10 లక్షల రూపాయలు ఇచ్చేలా బీమా సౌకర్యం కల్పిస్తుంది. దీని ద్వారా డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉండి లోన్ తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ లోన్ మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలపై భారం పడకుండా ఈ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు ముందుకు వచ్చింది.

దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ బీమా ప్రయోజనాలను ఈ ఏడాది అనగా 2024, మార్చి 14 నుంచే అమలులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం డ్వాక్రా రుణాలకు మాత్రమే కాకుండా స్త్రీనిధి లోన్లకు కూడా ఈ లోన్ బీమా వర్తించనుంది. కాగా క్షేత్ర స్థాయిలో బీమా క్లెయిమ్ చేసే విధానంపై ఇప్పటికే సెర్ప్, మెప్మా సిబ్బందికి మార్గదర్శకాలు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఈ లోన్ బీమా వర్తించనుంది. దీని వల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రుణాలు తీసుకున్న మహిళలు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు.. వారి వాటా మొత్తం చెల్లించడం సమస్యగా మారుతోంది.

స్వయం సహాయక సంఘాలు తీసుకునే లోన్‌ను గ్రూపుగానే చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యులు లోన్ కిస్తీ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గ్రూపులోని మిగతా సభ్యులపై ఆ భారం పడుతోంది. ఇలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇకపై డ్వాక్రా సంఘాల్లో సభ్యులై.. లోన్ తీసుకున్న మహిళలు ఎవరైనా.. ఏ కారణంతో చనిపోయినా.. వారు తీసుకున్న లోన్ రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది. ఒకవేళ మృతురాలు.. డ్వాక్రా, స్త్రీ నిధి లోన్ రెండూ తీసుకుని ఉంటే మాత్రం ఒక రుణం మాత్రమే మాఫీ కానుంది. అలానే ప్రమాదశావత్తూ డ్వాక్రా గ్రూపు సభ్యురాలు మృతి చెందితే.. యాక్సిడెంట్‌ బీమా కింద చనిపోయిన మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి