iDreamPost

RCB అంటే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కాదు! IPLకి ముందు కొత్త అర్థం!

  • Published Feb 28, 2024 | 7:08 PMUpdated Feb 28, 2024 | 7:08 PM

RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఆర్సీబీకి కొత్త అర్థం ఇదేనంటూ.. ఓ విషయం తెగ వైరల్‌ అవుతుంది. అదేంటో? దాని కథేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఆర్సీబీకి కొత్త అర్థం ఇదేనంటూ.. ఓ విషయం తెగ వైరల్‌ అవుతుంది. అదేంటో? దాని కథేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Feb 28, 2024 | 7:08 PMUpdated Feb 28, 2024 | 7:08 PM
RCB అంటే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కాదు! IPLకి ముందు కొత్త అర్థం!

క్రికెట్‌ అభిమానులకు పండగ సీజన్‌ లాంటి ఐపీఎల్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్‌ గ్రాండ్‌గా షురూ కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలుత ఓ 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఎప్పటిలాగే ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ కూడా హైఓల్టేజ్‌ మ్యాచ్‌లతో సాగనుంది. అభిమానులు కూడా రానున్న సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకో ఈ సారి ఐపీఎల్‌లో ఆర్సీబీ కప్పు కొడుతుందేమో అనే టాక్‌ సోషల్‌ మీడియాలో బలంగా వినిపిస్తోంది. టీమ్‌ ఎంతో స్ట్రాంగ్‌గా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆ.. ప్రతీ ఏడాది ఇదే మాట చెప్తారూ.. ఈ సాలా కప్‌ నమ్‌దే అంటారు.. తర్వాత తుస్సు మనిపిస్తారని కొంతమంది నిరాశ చెందొచ్చు. కానీ, ఈసారి నిజంగానే టీమ్‌ బాగుందని క్రికెట్‌ నిపుణులు కూడా అంటున్నారు. పైగా అంతా ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ, డుప్లిసిస్‌, మ్యాక్స్‌వెల్‌.. ఇలా స్టార్లంతా సూపర్‌ టచ్‌లో ఉన్నారు. అయితే.. ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ఆర్సీబీ కొత్త ఫుల్‌ఫామ్‌ అంటూ ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం వైరల్‌ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూడండి.

మనందరికీ తెలిసింది.. ఆర్‌ అంటే రాయల్‌, సీ ఛాలెంజర్స్‌, బీ అంటే బెంగళూరు.. మొత్తంగా ఆర్సీబీ అంటే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని అందరికి తెలుసు కానీ. ఆర్సీబీ అంటే అది కాదు.. కొత్త అర్థం మేం చెబుతాం అంటూ కొంతమంది అభిమానులు.. అదిరిపోయే ఫుల్‌ఫామ్‌తో ముందుకొచ్చారు. అదేంటంటే.. ఆర్‌ అంటే రోరింగ్‌ క్రౌడ్స్‌, సీ అంటే ఛేజింగ్‌ హార్ట్స్‌, బీ అంటే బీయింగ్‌ లాయల్‌. ఇదే ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్న ఫుల్‌ ఫామ్‌. నిజానికి.. ఆర్సీబీకి ఇదే సరైన అర్థంలా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే.. ఐపీఎల్‌లో ఉన్న అన్ని టీమ్స్‌ కంటే ఆర్సీబీ టీమ్‌కే అభిమానులు ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగా ఉన్న టీమ్స్‌లో ఆర్సీబీ ఒకటి. అది కూడా కేవలం క్రికెట్‌లోనే కాదు.. అన్ని రకాల స్పోర్ట్స్‌ టీమ్స్‌తో కంప్యార్‌ చేసినా.. ఆర్సీబీకి భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. కానీ, ఒక్కసారి కూడా ఐపీఎల్‌ కప్పు గెలవలేదనే అపవాదు కూడా ఆర్సీబీపై ఉంది. ఇప్పటి వరకు 16 ఐపీఎల్‌ సీజన్లు జరిగాయి.. ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టలేదు.

కోహ్లీ ఉన్నాడనే కారణంతో ఆర్సీబీకి భారీగా ఫ్యాన్‌ బేస్‌ పెరిగిన మాట వాస్తవం. కానీ, కప్పులు కొట్టకపోయినా, వేరే జట్ల అభిమానులు ట్రోల్‌ చేస్తున్నా.. ఆర్సీబీ ఫ్యాన్‌ బేస్‌ ఏం మాత్రం తగ్గడం లేదు సరికదా.. సీజన్‌ సీజన్‌కి పెరుగుతూ పోతోంది. ఐపీఎల్‌లోనే అనుకుంటే.. డబ్ల్యూపీఎల్‌(ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌)లో కూడా ఆర్సీబీ టీమ్‌కు భారీ క్రేజ్‌ ఉంది. తాజాగా డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన తొలి మ్యాచ్‌లో టాస్‌ కోసం వచ్చినప్పుడు ప్రేక్షకులు.. స్టేడియం దద్దరిల్లిపోయేలా అరిచారు. ఆ ఇన్సిడెంట్‌తో ఆర్సీబీ క్రేజ్‌ ఏంటో మరోసారి తెలిసొచ్చింది. మెన్స్‌ క్రికెట్‌లోనే అనుకుంటే.. ఉమెన్స్‌ క్రికెట్‌లో కూడా ఆర్సీబీ క్రేజ్‌ చూసి.. అంతా షాక్‌ అయ్యారు. అందుకోసమే.. ఆర్సీబీకి వచ్చిన కొత్త అర్థం రోరింగ్‌ క్రౌడ్స్‌, ఛేజింగ్‌ హార్ట్స్‌, బీయింగ్‌ లాయల్.. హండ్రెడ్‌ పర్సంట్‌ యాప్ట్‌ అనే చెప్పాలి. ముఖ్యంగా బీయింగ్‌ లాయల్‌ అనే ట్యాగ్‌ వాళ్లకే సరిగ్గా సెట్‌ అవుతుంది. ఎందుకంటే.. ఇన్నేళ్లలో ఒక్క కప్పు కొట్టకపోయినా.. ప్రతి ఏడాది ఈ సాలా కప్‌ నమ్‌దే అని బలంగా నమ్ముతారు. ఆర్సీబీని సపోర్ట్‌ చేయడం మానరు. మరి ఆర్సీబీకి వచ్చిన ఈ కొత్త అర్థంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి