iDreamPost

ఐదు బ్యాంకులపై RBI కొరడా.. ఏకంగా 60 లక్షల జరిమానా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝుళిపించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝుళిపించింది.

ఐదు బ్యాంకులపై RBI కొరడా.. ఏకంగా 60 లక్షల జరిమానా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు అతిక్రమించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది. నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల లైసెన్సులను సైతం రద్దు చేసేందుకు వెనకాడడం లేదు. భారీగా జరిమానాలను విధిస్తూ ఆర్బీఐ బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. బ్యాంకులు ఆర్బీఐ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కేవైసీ విషయంలో.. ట్రాన్సాక్షన్ల విషయంలో ఇంకా ఇతర నియమాల్లో బ్యాంకులు ఆర్బీఐ రూల్స్ తప్పక పాటించాల్సి ఉంటుంది. తాజాగా ఆర్బీఐ మరో ఐదు బ్యాంకులపై చర్యలు తీసుకుంది. ఏకంగా ఆ బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించింది. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝుళిపించింది.

ఐదు సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే?.. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం. డైరెక్టర్లు, వారి బంధువులకు లోన్స్, అడ్వాన్సులపై నిషేధం ఉల్లంఘించడం. కొన్ని సంస్థలకు పొదుపు ఖాతాలు తెరవడంపై ఆంక్షలు పాటించకపోవడం. డిపాజిట్ ఖాతాల నిర్వహణలో లోపాలు వెలుగు చూడడంతో భారీగా జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ పై ఎంత ఫైన్ విధించిందంటే..

రాజ్‌కోట్ నాగరిక్ సహకార బ్యాంక్ కు రూ.43.30 లక్షలు, కాంగ్రా కో-ఆపరేటివ్ బ్యాంక్ (న్యూఢిల్లీ)కు రూ.5 లక్షలు, రాజధాని నగర్ సహకార బ్యాంక్ (లక్నో)కు రూ.5 లక్షలు, జిల్లా సహకార బ్యాంక్, గర్వాల్ (కోట్‌ద్వార్, ఉత్తరాఖండ్) కు రూ.5 లక్షలు, జిల్లా సహకార బ్యాంకు (డెహ్రాడూన్)కు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఇక బ్యాంకులపై చర్యలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి బ్యాంకుల లైసెన్స్ లను సైతం రద్దు చేస్తుండడంతో బ్యాంకుల్లో మా డబ్బు సురక్షితమేనా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి