iDreamPost

OTT లోకి రజాకార్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే!

  • Published Apr 12, 2024 | 1:26 PMUpdated Apr 12, 2024 | 1:26 PM

ఓటీటీలో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరూ చూస్తున్న సినిమా.. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చిన రజాకార్ మూవీ. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఓటీటీలో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరూ చూస్తున్న సినిమా.. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చిన రజాకార్ మూవీ. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

  • Published Apr 12, 2024 | 1:26 PMUpdated Apr 12, 2024 | 1:26 PM
OTT లోకి రజాకార్ మూవీ..  ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే!

సినిమాలు, సిరీస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. వాటిని చూసే తీరికా ఓపికా ఉండాలే కానీ.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా 24/7 ఎంటర్టైన్ చేసే విధంగా.. వందల కొద్దీ సినిమాలు.. సిరీస్ లు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అవుతున్నాయి. వీటిలో ఏది చూడాలి ఏది చూడకూడదు అనే కన్ఫ్యూషన్ కూడా లేకుండా.. ప్రతి వారం ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాల జాబితాతో పాటు ఏ సినిమా బావుంది అనే మూవీ సజ్జెషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు మాత్రం కొన్ని ప్రత్యేకమైన సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నా సినిమా.. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన రజాకార్ సినిమా.. ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ఓటీటీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రజాకార్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోందో చూసేద్దాం.

రజాకార్ సినిమాకు యాటా స‌త్య‌నారాయ‌ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అన‌సూయ, బాబీసింహా, ఇంద్ర‌జ , వేదిక ప్రధాన పాత్రలలో నటించారు. కాగా, రజాకార్ సినిమా ఎన్నో వివాదాల మధ్యన మార్చి 15న థియేటర్ లో విడుదలైంది. కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. స్వతంత్రం రాడానికి ముందు నిజాం ప్రభువులకు అండగా తెలంగాణాలో రజాకార్లు కొనసాగించిన హింసాకాండను ఆవిష్కరిస్తూ.. ఈ సినిమాను తెరకెక్కించాడు. థియేటర్ లో ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుని.. ప్రశంసలను సైతం అందుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ సమయంలో జరిగిన చర్చల గురించి కూడా అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు రజాకార్ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి బాగా బజ్ నడుస్తోంది. కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకే అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి లేదా మే 3నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Razakar movie into OTT

ఇక రజాకార్ సినిమా కథ విషయానికొస్తే.. పూర్వం భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కానీ హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం ఇండియాలో విలీనం చేసేందుకు నిజం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒప్పుకోడు. ఇక నిజాం ప్రభువుకు అండగా.. రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైద‌రాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. పైగా మత మార్పిడికి పాల్పడడంతో పాటు.. వారంతా కూడా ఉర్దూ మాట్లాడాలని ఆంక్షలు విధిస్తూ.. వారిని కఠినంగా శిక్షించారు. ఈ క్రమంలో ఎంతో మంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. రజాకార్లు చేస్తున్న ఈ అక్రమాలను ఎదురించేందుకు కొంతమంది పోరాట యోధులు ఎలా పోరాటం చేశారు! చివరికి హైదరాబాద్ ను భారతదేశంలో ఎలా విలీనం చేశారు అనే సంఘటనలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భాగ్యనగరం కథ. చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి