iDreamPost

వాల్తేరు వీరయ్యలో రవితేజ చేయనన్నాడు.. కథ చెబుతానన్నా వద్దన్నాడు: డైరెక్టర్ బాబీ

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బడా హీరోలు సందడి చేసినట్లే.. గత ఏడాది కూడా మంచి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఇందులో రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. శృతి హాసన్, కేథరిన్ కథానాయకులు, మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు డైరెక్టర్ బాబీ.

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బడా హీరోలు సందడి చేసినట్లే.. గత ఏడాది కూడా మంచి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఇందులో రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. శృతి హాసన్, కేథరిన్ కథానాయకులు, మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు డైరెక్టర్ బాబీ.

వాల్తేరు వీరయ్యలో రవితేజ చేయనన్నాడు.. కథ చెబుతానన్నా వద్దన్నాడు: డైరెక్టర్ బాబీ

గత ఏడాది సంక్రాంతి బరిలో దిగి మంచి హిట్ అందుకోవడమే కాదూ.. సూపర్ స్టార్ చిరంజీవికి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ మూవీకి దర్శకుడు యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. బడా హీరోల సినిమాల్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ గుంటూరు కుర్రాడు.. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని మెగా ఫోన్ చేతబట్టి.. ఇండస్ట్రీకి హిట్ మూవీస్ అందించాడు. రవితేజ పవర్ చిత్రంతో తన సత్తా చాటిన ఈ టాలెంట్ డైరెక్టర్.. పవన్‌తో సర్దార్ గబ్బర్ సింగ్, జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ, వెంకీ, నాగ చైతన్యతో వెంకీ మామ, మెగాస్టార్‌తో వాల్తేరు వీరయ్య తెరకెక్కించాడు. ఇప్పుడు నందమూరి నట సింహం.. బాలయ్యతో సినిమాను తీసే పనిలో పడ్డాడు.

ఈ సందర్భంగా తనకు డైరెక్టర్ గా తొలి అవకాశాన్ని ఇచ్చిన రవితేజ.. వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ క్యారెక్టర్ ఆఫర్ చేయగా.. ఆయన చేయనంటూ చెప్పాడట. వీటితో పాటు ఎన్నో విషయాలను ’ఐడ్రీమ్ మీడియా‘కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు బాబీ. ‘డైరెక్టర్ కాక ముందు 11 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. రూ. 500లతో పెరిగింది కెరీర్ స్టార్ అయ్యి.. రూ. 1500లకు పెరిగింది. చిన్ని కృష్ణ దగ్గర శిష్యరికం చేశా. నాన్న చిరంజీవి ఫ్యాన్. ఆయన సినిమా విడుదలైన రోజు.. స్కూల్ ఎగ్గొట్టించి మరీ తీసుకెళ్లేవాడు. నేను చాలా ఇంట్రోవర్ట్‌ని, కెమెరా ముందు యాక్ట్ చేయలేను. చిన్న భయం, అసౌకర్యానికి గురౌతాను’ అని చెప్పారు. తనకు చిన్నప్పటి నుండే కథలు చెప్పే అలవాటు ఉందని, అది ఇన్ బిల్డ్ గా వచ్చిందన్నారు.

’వెంకీ మామ అయిపోయాక.. కథలు రాసుకుంటున్నా.. చిరంజీవిని కలవడానికి కాల్ వచ్చింది. వెళ్లి కలిశా.. లూసిఫర్ చూశావా అని అడిగారు. ఆ రైట్స్ ఉన్నాయ్.. ఆ సినిమా చూసి ఎలా ఉందో చెప్పు.. డైరెక్టర్ గా అవకాశం ఉంది అనగానే భయం మొదలైంది. ఆ మూవీని 25 సార్లు చూశా.. కానీ ఎక్కట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో ఇదే జరిగింది. అందుకే సొంత కథతోనే వెళ్లాలని అనుకున్నా. అందుకే లూసిఫర్ ఆఫర్ వదులుకున్నా. రెండు రోజుల తర్వాత ఆయనకు ఎలా చెప్పాలో.. అర్థం కాక.. వెళ్లి కలిసి.. చిరుకు చెప్పేశాను. మరో కథ ఉందని చెప్పి వచ్చేశాను. 20 రోజుల తర్వాత వాల్తేరు వీరయ్యలోని కొన్ని సీన్లు చెప్పా’ అని తెలిపారు.

’సినిమా చిరంజీవి ఒప్పుకున్నాక..సోల్ క్రియేట్ చేయమన్నారు. స్క్రిప్టు లాకయ్యాక.. లాక్ డౌన్ వచ్చింది. ఈ సినిమా ఓకే అన్నారు. ఏదో సంతృప్తి అనిపించింది. ఓ రవితేజ లాంటి వ్యక్తులు ఉంటే..ఎలా ఉంటుంది అనిపించింది. నేను ఎప్పుడు పెన్ పట్టుకున్నా రవితేజనే గుర్తుకు వస్తాడు. అలా ఓ రోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. అప్పటికే 80 శాతం పూర్తయ్యింది. నిర్మాతకు చెప్పా.. ఓకే చేశారు. మెగాస్టార్ చిరంజీవికి చెప్పాను. నేను చెబుతున్న కథకు.. రవితేజ అని ఫిక్స్ చేశారు చిరు సార్. రవితేజ.. చెప్పాలంటే..అంత ఈజీ కాదూ.. స్టార్ హీరో అయ్యాక..సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. ఆయనతో నాకు ఎమోషనల్ జర్నీ ఉంది. ఆయన వల్లే నేను ఇంత స్థాయికి వచ్చాను. కానీ చెప్పడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పారు.

‘ నాకు చాలా చనువు ఉంది రవితేజ దగ్గరే. సర్ మీతో వన్ అవర్ టైం కావాలి. మీకో కథ చెప్పాలి అనగానే.. చిరంజీవి సినిమా తర్వాత మూవీదా అబ్బాయి అని అడిగారు. మీరు కథ వినేది చిరంజీవి సినిమాలోదే. మీకు కథ నచ్చితేనే అని చెప్పా. వద్దులే అబ్బాయి.. ఎందుకు షెడ్యూల్స్ టైట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో అన్నయ్య కథ విని, నేను నచ్చలేదు అంటే అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడు మాట నాకెందుకు. నేను, అన్నయ్య అన్నదమ్ముల్లా ఉంటాం అని రవితేజ అన్నారు. అయితే ఆయన్ను కన్విన్స్ చేశాను. వినలేదు. ఇంటికి వెళ్లాక రేపు 11 గంటలకు అని మేసేజ్ చేశాడు రవితేజ. పస్టాఫ్ చెప్పాక.. సెకండాఫ్ చెప్పాక.. క్యారెక్టర్ చాలా బాగుంది. అన్నయ్యతో ఎప్పటి నుండో చేయాలని అనుకున్నా అని అన్నారు. అలా సెట్ అయ్యిందని’ చెప్పారు. ఇంకా అనేక విషయాలు పంచుకున్నారు బాబీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి