iDreamPost

చెత్త కుప్పలో బంగారం! ఆ దంపతుల కష్టం ఎలుక తీర్చింది!

సాధారణంగా ఎలుకలను ఎవరు ఇష్టపడరు.. ఇంట్లోకి చొరబడి అన్ని కొరికేస్తాయని, పొలాల్లో రైతులకు నష్టం చేస్తుంటాయని వాటిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఓ ఎలుక ఓ కుటుంబానికి అతి పెద్ద సాయమే చేసింది.

సాధారణంగా ఎలుకలను ఎవరు ఇష్టపడరు.. ఇంట్లోకి చొరబడి అన్ని కొరికేస్తాయని, పొలాల్లో రైతులకు నష్టం చేస్తుంటాయని వాటిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఓ ఎలుక ఓ కుటుంబానికి అతి పెద్ద సాయమే చేసింది.

చెత్త కుప్పలో బంగారం! ఆ దంపతుల కష్టం ఎలుక తీర్చింది!

రామునికి ఉడత చిన్న సాయం చేసినట్లు.. ఓ అమ్మాయి పెళ్లి విషయంలో పెద్ద హెల్పే చేసిందో మూషికం. ఉడుత సాయం గురించి తెలుసు కానీ.. ఈ ఎలుక సాయం ఏంటీ అనుకుంటున్నారా.. అది తెలుసుకోవాలంటే.. ముందు ఈ స్టోరీ చదవండి. సాధారణంగా ఎలుకలు అంటే ఇబ్బంది కలిగిస్తాయని భావిస్తుంటారు. ఇంట్లోకి చొరబడి.. ఉల్లిపాయలు, కూరగాయలు, బియ్యం, పేపర్లతో సహా పర పర..కర కర నమిలేస్తుంటాయి. ఇంట్లోనే కాదు కార్యాలయాల్లోకి కూడా చొరబడి ముఖ్యమైన ఫైల్స్ కొరికేస్తుంటాయి. ఇక పంట పొలాల్లో కూడా బొరియలు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అందుకే ఎలుకలను ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ ఎలుక మాత్రం.. తనకు తెలియకుండానే పెద్ద సాయమే చేసింది. ఇంతకు ఏంటీ అనుకుంటున్నారా..?

కూతురు పెళ్లి కోసం నగలు తాకట్టుపెట్టేందుకు వెళ్లిన మహిళ వాటిని పొగొట్టుకోగా.. ఆ బంగారాన్ని పట్టుకునేందుకు పోలీసులు దారి చూపింది మూషికం. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని దిండోసి ప్రాంతంలో జరిగింది. దిండోసి ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ తన కూతురి పెళ్లి కోసం డబ్బులు అవసరమయ్యి తన వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు బయలు దేరింది. దారిలో ఓ యాచకురాలు కనిపించింది. ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూసిన సుందరి తన చేతిలో ఉన్న వడాపావ్ ఆమెకు ఇచ్చి వెళ్లిపోయింది. బ్యాంకుకు వెళ్లి చూసే సరికి నగల బ్యాగ్ కనిపించలేదు. చివరకు ఆ వడాపావ్ బ్యాగులోనే బంగారం బ్యాగు కూడా ఉన్నట్లు గుర్తించి.. హుటా హుటిన యాచకురాలు ఉన్న ప్రాంతానికి పరుగులు పెట్టింది.

కానీ ఆ యాచకురాలు అక్కడ కనిపించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. చుట్టూ వెతికారు. యాచకురాలి కోసం వెతుకులాట ప్రారంభించి.. ఎట్టకేలకు పట్టుకున్నారు. తనకు ఇచ్చిన బ్యాగ్ గురించి అడగ్గా.. వడా పావ్ ఎండిపోయిందేమో అనుకుని చెత్తకుప్పలో పడేసినట్లు పేర్కొంది. ఆ చెత్త కుప్పలో కూడా వెతికినా కనిపించలేదు. చివరకు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఓ ఎలుక ఆ బ్యాగ్ పట్టుకున్నట్లు గుర్తించారు. ఆ బ్యాగును ఓ మురికి కాలువలోకి మూషికం తీసుకెళ్లినట్లు గుర్తించి.. వెంటనే అందులోకి దిగి స్వాధీనం చేసుకున్నారు. వెంటనే సుందరి కుటుంబానికి అప్పగించారు పోలీసులు. పోయింది అనుకున్న బంగారం  దొరికే సరికి పొంగిపోయారు పొంగిపోయింది సుందరి కుటుంబం. అలా ఎలుక తనకు తెలియకుండానే సాయం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి