ఆఫ్ఘానిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ స్టార్ స్పిన్నర్‌కు ఏమైందని ఆందోళన చెందుతున్నారు.
ఆఫ్ఘానిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ స్టార్ స్పిన్నర్‌కు ఏమైందని ఆందోళన చెందుతున్నారు.
క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో అలరించిన వన్డే వరల్డ్ కప్-2023 ముగిసింది. ఏడు వారాల పాటు ఎన్నో ఉత్కంఠ రేపిన మ్యాచులు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌తో ఆడియెన్స్‌ను ఊపేసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి మెగా టోర్నీ మ్యాచులు లైవ్‌గా చూసేందుకు స్టేడియాలకు పోటెత్తారు ప్రజలు. లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా ఈ వరల్డ్ కప్ పాత రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసేసింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్స్ నాకౌట్‌కు చేరడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కప్పు గెలిచింది ఆసీసే కానీ మిగిలిన టీమ్స్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాయి. భారత్ అయితే వరుసగా 10 విజయాలు సాధించి ఇలా కూడా ఆడతారా అనేంతగా టోర్నీలో డామినేషన్ చేసింది.
టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు ఆడిన తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. లీగ్ స్టేజ్ నుంచి సెమీస్ వరకు చాలా మ్యాచుల్లో ఒత్తిడి నెలకొన్న సమయాల్లో దాని నుంచి బయటపడి రోహిత్ సేన నెగ్గిన తీరును ఎవరూ అంత ఈజీగా మార్చిపోలేరు. ఈ వరల్డ్ కప్‌లో అందర్నీ అలరించిన టీమ్స్‌లో ముఖ్యంగా ఆఫ్ఘానిస్థాన్ గురించి చెప్పుకోవాలి. వరల్డ్ కప్ మొదలవ్వడానికి ముందు వరకు ఆ జట్టును అందరూ పసికూనలా చూశారు. ఇప్పటికే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు, టోర్నమెంట్స్‌లో పలు బడా టీమ్స్‌కు ఆఫ్ఘాన్ షాక్ ఇచ్చింది. అయినా ప్రపంచ కప్‌లో ఆ జట్టు పెద్దగా ఏం చేయలేదనే అనుకున్నారు. కానీ అలాంటి వాళ్ల అభిప్రాయాలను ఆఫ్ఘానిస్థాన్ తప్పని ప్రూవ్ చేసింది.
ప్రపంచ కప్-2023 సమష్టిగా ఆడి విజయాలు సాధించింది ఆప్ఘానిస్థాన్. ఆడిన 9 మ్యాచుల్లో నాలుగింట నెగ్గింది. ఆ నాలుగులో ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లపై గెలవడం టోర్నీలో సంచలనమనే చెప్పాలి. వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా జర్నీని స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ టీమ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘాన్ వీరులు.. పొరుగు దేశం పాక్‌నూ చిత్తు చేసి సెమీస్‌కు వెళ్లేలా కనిపించారు. అయితే కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో ఫెయిలవ్వడం వారిని దెబ్బతీసింది. ఆ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (201 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను గెలిపించాడు. అతడ్ని ఔట్ చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది. వరల్డ్ కప్ జర్నీని సెమీస్‌కు చేరకుండానే ముగించింది ఆఫ్ఘాన్. కానీ ఆ టీమ్ ఆటతీరుకు అందరూ ఫిదా అయ్యారు. వచ్చే ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఇలాగే ఆడితే కప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇక.. ఆఫ్ఘాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అతడికి ఏమైందని క్రికెట్ లవర్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిందేమీ లేదు. రషీద్‌కు వెన్నెముక సర్జరీ (బ్యాక్ సర్జరీ) సక్సెస్ అయింది. చాన్నాళ్లుగా అతడు ఈ సమస్యతో బాధపడుతున్నాడట. అయితే వరల్డ్ కప్ తర్వాత సర్జరీ చేయించుకుంటానని ప్రకటించిన రషీద్.. మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు. తాను ఆస్పత్రిలో ఉన్న ఫొటోను స్వయంగా అతడే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సర్జరీ విజయవంతమైందని.. మళ్లీ గ్రౌండ్లోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. కాగా, ఈ సర్జరీ కారణంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్‌కు ఈ స్టార్ స్పిన్నర్ దూరమయ్యాడు.
ఇదీ చదవండి: క్రెడిట్ దొబ్బేశాడనే విమర్శలపై తొలిసారి స్పందించిన ధోని! గంభీర్‌కు కౌంటర్?
Thank you everyone for your well wishes 🙏
The surgery went well, now on the road to recovery 💪
Can’t wait to be back on the field 💙 pic.twitter.com/zxLYKFaoYE— Rashid Khan (@rashidkhan_19) November 23, 2023