iDreamPost
android-app
ios-app

క్రెడిట్‌ దొబ్బేశాడనే విమర్శలపై తొలిసారి స్పందించిన ధోని! గంభీర్‌కు కౌంటర్‌?

  • Published Nov 24, 2023 | 11:15 AMUpdated Nov 24, 2023 | 11:15 AM

2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని ఒక్క ఇన్నింగ్స్‌ ఆడి.. వరల్డ్‌ కప్‌ గెలిచిన క్రెడిట్‌ మొత్తం లాగేసుకున్నాడని చాలా సార్లు టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కామెంట్‌ చేశాడు. అయితే.. వాటిపై ఎప్పుడూ స్పందించని ధోని.. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు. ధోని మాట్లాడుతూ ఏం అన్నాడు ఇప్పుడు చూద్దాం..

మహేంద్రసింగ్‌ ధోని-గౌతమ్‌ గంభీర్‌.. ఈ ఇద్దరు 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ హీరోలు. చాలా కాలం పాటు టీమిండియాకు ఆడుతూ.. ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. ఇద్దరూ స్టార్‌ ప్లేయర్లే కానీ, ధోనికి ఉన్నంత క్రేజ్‌, గుర్తింపు గంభీర్‌కు దక్కలేదు. ఇదే విషయాన్ని గంభీర్‌ చాలా సందర్భాల్లో వెల్లడించాడు. 2011లో వరల్డ్‌ కప్‌ ధోని ఒక్కడి వల్లే గెలవలేదని, టీమ్‌ మొత్తం కష్టపడితేనే వచ్చిందని, క్రిడిట్‌ మొత్తం ఒక్కడికే కట్టబెట్టేయడం సరికాదని అనేక సందర్భాల్లో గంభీర్‌ తన ఆక్రోషాన్ని వెల్లగక్కాడు. నిజానికి చాలా మంది క్రికెట్‌ అభిమానులు సైతం 2011 వన్డే వరల్డ్‌ కప్‌ అనగానే ధోనినే గుర్తు తెచ్చుకుంటారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్స్‌లో కొట్టిన చివరి సిక్స్‌ అభిమానుల్లో కళ్ల ముందు కదులుతుంది.

కానీ, వరల్డ్‌ కప్‌ అనగానే ధోనినే అంతా గుర్తు చేయడం, ఆ ఒక్క షాట్‌తోనే వరల్డ్‌ కప్‌ గెలిచాం అనుకోవడం ముర్ఖత్వం అని కూడా మరికొంత మంది క్రికెట్‌ అభిమానులు అంటుంటారు. గంభీర్‌తో పాటు హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌, సెహ్వాగ్‌లు సైతం అప్పుడప్పుడు.. ఈ విషయంపై స్పందించినవాళ్లే. వరల్డ్‌ కప్‌ క్రెడిట్‌ ఒక్కడికే దక్కడంపై వాళ్లు కూడా పెదవి విరిచారు. అయితే.. గంభీర్‌ ఎన్ని సార్లు మాట్లాడినా.. ధోని మాత్రం ఒక్కసారి కూడా ఈ విషయంపై స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు తప్పా.. గంభీర్‌ చెప్పిన దానికి బదులు చెప్పడం చేయలేదు. కానీ, తొలిసారి గంభీర్‌కు ధోని ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇస్తూ మాట్లాడాడు.

ఆటలో వ్యక్తిగత గుర్తింపు గురించి మాట్లాడుతూ.. నిజానికి క్రికెట్‌ టీమ్‌ గేమే కానీ, చాలా సందర్భాల్లో ఒక్కడే ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో ఒక్కడే ఉంటాడు. తనకు ఒక పార్ట్నర్‌ ఉన్నా.. కూడా బాల్‌ను ఫేసేది ఒక్కడే, అలాగే బౌలర్‌కు ఎన్ని సలహాలు ఎంతమంది ఇచ్చినా.. బాల్‌ వేసేది అతనొక్కడే. సో.. ఆటలో కొన్నిసార్లు ఒక్కడే ఆడాల్సి వస్తుంది. దాన్ని బట్టే గుర్తింపు కూడా ఉంటుందని పేర్కొన్నాడు. అయితే.. ధోని ఇక్కడ ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు, నెటిజన్లు గంభీర్‌కు కౌంటర్‌గానే ధోని మాట్లాడాడంటూ సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Fanatic cricketer (@fanatic__cricketer)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి