iDreamPost

‘యానిమల్​’ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
‘యానిమల్​’ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

సందీప్ రెడ్డి వంగా.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్​ను షేక్ చేశారు. ఆ మూవీనే ‘అర్జున్ రెడ్డి’. ఇలా కూడా చిత్రాలు తీయొచ్చా అనేలా బోల్డ్​గా సందీప్ స్టోరీని చెప్పిన విధానానికి ఆడియెన్స్​ ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి క్యారెక్టర్​లో విజయ్ దేవరకొండ యాక్టింగ్​ను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. విజయ్ క్రేజ్​ను అమాంతం పెంచిందా చిత్రం. అర్జున్ రెడ్డి పాత్రను సందీప్ రెడ్డి డిజైన్ చేసిన పద్ధతి నచ్చి బాలీవుడ్​లోనూ ఈ మూవీని రీమేక్ చేసే ఛాన్స్ ఆయనకే ఇచ్చారు. దీంతో టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ని షాహిద్ కపూర్​తో హిందీలో ‘కబీర్ సింగ్’గా తీశారాయన.

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సందీప్ రెడ్డి వంగాను వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటు టాలీవుడ్ నుంచి కూడా పెద్ద హీరోలు ఆయన డైరెక్షన్​లో నటించేందుకు ఫుల్ ఇంట్రెస్ట్ చూపించారు. అయితే సందీప్ మాత్రం బాలీవుడ్​కే ఓటేశారు. స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​తో ‘యానిమల్’ అనే సినిమాను తీస్తున్నారాయన. ఈ మూవీ తర్వాత ప్రభాస్​తో ‘స్పిరిట్’ అనే ఫిల్మ్​ను సందీప్ డైరెక్ట్ చేయనున్నారు. ఇక, ‘యానిమల్’ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్​ అందర్నీ ఆకట్టుకుంటోంది.

‘యానిమల్’ ట్రైలర్​లో రణ్​బీర్​ను ముందెప్పుడూ చూడని రీతిలో స్టైలిష్ మాస్ అవతార్​లో చూపించారు సందీప్ రెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్​లో విమానంలోని కాక్​పిట్​లో రణ్​బీర్-రష్మికలు లిప్ కిస్ ఇచ్చుకుంటూ కనిపించారు. ట్రైలర్​తో పాటు నయా పోస్టర్​తోనూ మంచి బజ్ తెచ్చుకున్న ‘యానిమల్’ డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. సినిమాలో రణ్​బీర్-రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందట.

ఫస్ట్ నైట్ సీన్ టైమ్​లో హీరో, హీరోయిన్లపై విలన్ గ్యాంగ్ అటాక్ చేస్తారట. దీంతో రణ్​బీర్ వారిని చితగ్గొట్టి తరిమేస్తాడట. ఆ తర్వాత రష్మికతో రొమాన్స్ చేస్తాడని సోషల్ మీడియాలో వినికిడి. ఇందులో ఎంత నిజం ఉందనేది సినిమా రిలీజ్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది. అయితే ఇది విన్న నెటిజన్స్ మాత్రం రణ్​బీర్-రష్మికతో సందీర్ రెడ్డి ప్రయోగం చేస్తున్నారని.. ఇలాంటి డిఫరెంట్ సీన్​ను ఏ మూవీలోనూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ ఐడియా సూపర్ అని మరికొందరు అంటున్నారు. మరి.. ‘యానిమల్’ గురించి వస్తున్న లేటెస్ట్ గాసిప్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: KBC లైవ్​లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్.. ఇంకెంత ఏడిపిస్తారంటూ..!

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి