iDreamPost
android-app
ios-app

రైల్వేస్టేషన్ సమీపంలో తెగిన విద్యుత్ తీగలు!…

రైల్వేస్టేషన్ సమీపంలో తెగిన విద్యుత్ తీగలు!…

నిత్యం వేలాది మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అలానే ప్రజలకు ఈ రైళ్లు చాలా సౌకర్యవంతగా, తక్కువ ధర అందుబాటులో ఉన్నాయి. అయితే పలు సందర్భాలో రైలు ప్రమాదాలకు గురవుతుంటాయి. సాంకేతిక సమస్య, విద్యుత్ లైన్లు తెగి పోవడం, పట్టాలు విరిగిపోవడం వంటి కారణాలతో రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవలే ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలను కోల్పోయారు. అలానే పలు సందర్భాల్లో కొన్ని రైళ్లు పెను ప్రమాదాల నుంచి తప్పించుకున్నాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ వైర్లు తెలిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జి.సిగదడం రైల్వే స్టేషన్  సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈక్రమంలో స్థానిక రైల్వే అధికారులు విద్యుత్ వైర్లు తెగిపోవడం గుర్తించి.. మిగిలిన స్టేషన్ల్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. పలు స్టేషన్లలో రైళ్లను ఆపేశారు పలాస నుంచి విశాఖ వెళ్లే ప్యాసింజర్ నిలిచిపోయింది. పలు రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని పనులు జరుగుతున్నాయి.. ఈ కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ పరిధిలోని రైల్వే లైన్లలో భద్రతాపరమైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ మీదుకు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. అలానే  మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 18 నుంచి 24 వరకు కాకినాడ, వైజాగ్ మధ్య నడిచే పాసింజర్‌ (17267/17268),  విశాఖ-రాజమండ్రి ప్రత్యేక పాసింజర్‌,గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-రాయగడ (17243), మచిలీపట్నం-విశాఖ (17219) రద్దు చేశారు. అలాగే, జసిదిహ్‌-తంబరం ఎక్స్‌ప్రెస్‌ (12376)కు ఈనెల 20న, హటియా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (22837)కు ఈనెల 18న ఏలూరు స్టేషన్‌లో హాల్ట్‌ లేదని  రైల్వే అధికారులు తెలిపారు.