iDreamPost
android-app
ios-app

ఏదేమైనా స్టూడెంట్ ని కొట్టడం తప్పే.. క్షమించండి!: లారెన్స్

  • Author ajaykrishna Published - 11:35 AM, Mon - 28 August 23
  • Author ajaykrishna Published - 11:35 AM, Mon - 28 August 23
ఏదేమైనా స్టూడెంట్ ని కొట్టడం తప్పే.. క్షమించండి!: లారెన్స్

ఇండస్ట్రీలో ఏవైనా మూవీ ఈవెంట్స్ జరిగినప్పుడు హీరోలకు తెలియకుండా కొన్నిసార్లు ఫ్యాన్స్ గాయపడుతుంటారు. అది జనాలు విపరీతంగా ఉండటంతో తోపులాట లేదా కారణం వేరే ఏదైనా కావచ్చు. ఆ తర్వాత తమ ఫ్యాన్ ఈవెంట్ లో గాయపడిన విషయం తెలిసి.. హీరోలు క్షమాపణలు కోరుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ విషయంలో జరిగింది. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు డైరెక్టర్ గా రాణిస్తున్న లారెన్స్.. లేటెస్ట్ గా ‘చంద్రముఖి 2’ చేశాడు. చంద్రముఖిని తెరకెక్కించిన డైరెక్టర్ పి. వాసునే ఈ సీక్వెల్ ని కూడా రూపొందించారు.

దాదాపు 17 ఏళ్ల తర్వాత తెరకెక్కిన చంద్రముఖి సీక్వెల్.. సెప్టెంబర్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. లారెన్స్ హీరోగా నటించగా.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించింది. ఇటీవల గ్రాండ్ గా ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ జరిగింది. అయితే.. ఈ ఆడియో లాంచ్ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్ధి బౌన్సర్ చేతిలో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చంద్రముఖి 2 ఆడియో లాంచ్ కి వెళ్లిన ఓ విద్యార్ధికి, అక్కడున్న బౌన్సర్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. దీంతో సదరు బౌన్సర్ ఆ విద్యార్ధిపై దాడి చేసాడట. ఈ గొడవంతా ఆడిటోరియం బయట జరగ్గా.. విషయం కాస్త లారెన్స్ కి ఆలస్యంగా తెలిసింది.

ఈ విషయం తెలిసిన వెంటనే.. లారెన్స్ ట్విట్టర్ వేదికగా స్పందించి.. ఆ విద్యార్ధిపై దాడి జరిగినందుకు క్షమాపణలు కోరాడు. “చంద్రముఖి 2 ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఓ స్టూడెంట్, బౌన్సర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. లోపల ఈవెంట్ జరగడంతో బయట ఏం జరిగిందో నాకు తెలియలేదు. స్టూడెంట్స్ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలిసిందే. వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటాను. నాకు అసలే గొడవలు నచ్చవు. అలాంటిది ఓ బౌన్సర్ విద్యార్థిని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. కారణం ఏదైనా స్టూడెంట్ ని కొట్టడం తప్పే కాబట్టి.. నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇకపై ఇలాంటి దాడులు జరగకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను.” అని ట్వీట్ లో పేర్కొన్నాడు లారెన్స్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom