iDreamPost
android-app
ios-app

ఆ హీరో సినిమాలో రాశి.. అప్పుడు ఇప్పుడు సెకండ్ ఛాయస్ యేనా..?

  • Author ajaykrishna Updated - 01:41 PM, Tue - 31 October 23

ఇండస్ట్రీలో లీడ్ హీరోయిన్స్ గా కెరీర్ ఆరంభించిన రాశిఖన్నా.. ఆ తర్వాత పాత్రలను బట్టి.. వాటి స్కోప్ బట్టి సెకండ్ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. అలా ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ ఓసారి సెకండ్ హీరోయిన్ గా చేసిన హీరోతో మళ్ళీ అవకాశం వచ్చిందట. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఇండస్ట్రీలో లీడ్ హీరోయిన్స్ గా కెరీర్ ఆరంభించిన రాశిఖన్నా.. ఆ తర్వాత పాత్రలను బట్టి.. వాటి స్కోప్ బట్టి సెకండ్ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. అలా ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ ఓసారి సెకండ్ హీరోయిన్ గా చేసిన హీరోతో మళ్ళీ అవకాశం వచ్చిందట. ఆ వివరాల్లోకి వెళ్తే..

  • Author ajaykrishna Updated - 01:41 PM, Tue - 31 October 23
ఆ హీరో సినిమాలో రాశి.. అప్పుడు ఇప్పుడు సెకండ్ ఛాయస్ యేనా..?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరు గెస్ చేయలేరు. ఎందుకంటే.. కొందరు మెయిన్ హీరోయిన్స్ గా డెబ్యూ చేస్తుంటారు. ఇంకొందరు ఫ్రెండ్ లేదా సైడ్ క్యారెక్టర్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్స్ అవుతుంటారు. కాకపోతే సైడ్ క్యారెక్టర్స్ తో వచ్చిన వారికంటే.. మోడలింగ్ ద్వారా డైరెక్ట్ హీరోయిన్స్ గా అడుగు పెట్టేవారి సంఖ్య ఎక్కువ. అలా మోడలింగ్ నుండి యాక్టింగ్ వైపు అడుగులు వేసిన బ్యూటీలలో రాశిఖన్నా ఒకరు. టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో డెబ్యూ చేసిన ఈ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్ సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసేసింది. అయినా.. సరైన హిట్స్ పడక స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.

ఇక స్టార్ హీరోల నుండి యంగ్ స్టర్స్ వరకు అందరి సరసన.. అన్ని రకాల క్యారెక్టర్స్ పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నటిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఆరంభంలో ముద్దుగా బొద్దుగా మురిపించిన అమ్మడు.. రాను రాను సన్నబడి అందరికీ షాకిచ్చింది. ఒకరకంగా రాశి బొద్దుగా ఉంటేనే బాగుండేది అనే అభిప్రాయాలను ఇప్పటికి వినిపిస్తుంటాయి. తెలుగులోనే కాకుండా అటు తమిళ, హిందీ ఇండస్ట్రీలలో సైతం రాశి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ.. తెలుగులో వచ్చినంత పేరు, ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడా రాలేదు. ఈ మధ్య రాశి తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. ఎందుకో తెలియదు గానీ.. థ్యాంక్యూ సినిమా చేసింది.

ఇదిలా ఉండగా.. రవితేజ సరసన బెంగాల్ టైగర్ సినిమా చేసిన రాశి.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇంకో చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని – రవితేజతో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో నాలుగో సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని చూస్తున్నారని, సెకండ్ హీరోయిన్ గా మాత్రం రాశి కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ సినిమాలో రాశి సెకండ్ హీరోయిన్ కావడంతో.. రెండోసారి కూడా రాశిని సెకండ్ హీరోయిన్ చేశారా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే.. బెంగాల్ టైగర్ లో కూడా రాశి.. సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈసారి కూడా అలాగే అని తెలిసి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాశిఖన్నా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş