iDreamPost

రాజుగారి చేతికే తెగింపు కూడా

రాజుగారి చేతికే తెగింపు కూడా

ఇప్పటికే సంక్రాంతి పందెం మహా వేడెక్కగా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు వాతావరణాన్నిమరింత టెన్షన్ గా మారుస్తున్నాయి. థియేటర్ల విషయంలో ఒక ఎగ్జి బిటర్ గా నిర్మాతగా తన స్టాండ్ లో ఎలాంటి మార్పు ఉండదంటున్న దిల్ రాజు ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను ఎదురుకుంటున్న రిస్కులతో పాటు చాలా విషయాలే పంచుకున్నారు. వారసుడు తమిళ చిత్రమే అయినప్పటికీ ఒక తెలుగు నిర్మాత టాలీవుడ్ దర్శకుడు నిర్మించింది కాబట్టి దాన్ని మిగిలిన డబ్బింగ్ సినిమాలతో పోల్చలేమని తేల్చి చెబుతున్నారు. స్క్రీన్ కౌంట్ విషయంలో రాజీపడే ధోరణి ఉండదనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. దీని మీద ఆల్రెడీ చర్చ మొదలైంది.

తాజాగా అజిత్ తెగింపుకు సంబంధించి నైజామ్, వైజాగ్ థియేట్రికల్ హక్కులను దిల్ రాజే సొంతం చేసుకున్నారు. అంటే సిచువేషన్ మరింత టైట్ కాబోతోందన్న మాట. ఎవరికి ఎన్ని స్క్రీన్లనే అంశం మీద ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తెగింపుని బరిలో దించడం వల్ల ఇబ్బందులు ఎక్కువవుతాయే తప్ప తగ్గవు. పైగా అందరికీ పండగ సీజన్ కావాలనడం దగ్గరే అసలు చిక్కంతా వచ్చింది. నువ్వా నేనా అనే రీతిలో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో అయిదు కంటే తక్కువ థియేటర్లున్న సెంటర్లలో ఎగ్జిబిటర్లకు చాలా సమస్యలు వస్తాయి. ఒక్కో కేంద్రంలో చిరు బాలయ్యలకు కనీసం రెండేసి ఇవ్వలేని పరిస్థితి ఉంటే వసూళ్ల మీద ప్రభావం పడుతుంది

మొత్తానికి రాబోయే పధ్నాలుగు రోజులు క్రేజీగా ఉండబోతున్న సంగతి అర్థమవుతోంది. తెగింపుకి ఇక్కడ పెద్ద క్రేజ్ లేదు కాబట్టి మరీ ఎక్కువ డిమాండ్ ఉండదు కానీ దానికోసం మెయిన్ సెంటర్స్ లో ఒక్కో థియేటర్ ఇచ్చినా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఒకటి తగ్గినట్టే. తమిళంలో మనవి వస్తున్నప్పుడు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కనీస ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితిలో ఇక్కడ మాత్రం డబ్బింగ్ బొమ్మలకు అడిగి మరీ రెడ్ కార్పెట్ వేయడం గురించి ఎన్ని కామెంట్స్ వస్తున్నా అవన్నీ ఎడారిలో ఆర్తనాదంలాగా మిగిలిపోతున్నాయి. ఇవి కాకుండా ఇంకా యాక్టివ్ ప్రమోషన్లే మొదలుపెట్టని కళ్యాణం కమనీయం, విద్యావాసుల అహంలు ఏం చేయబోతున్నాయో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి