iDreamPost

దేవుడా.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లెస్ అన్ని వందల కోట్లా?

Priyanka Chopra Wears crore worth Diamond Necklace: బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వార్తల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆమె ధరించిన ఒక డైమెండ్ నెక్లస్ ధర వందల కోట్ల రూపాయలు ఉందంట.

Priyanka Chopra Wears crore worth Diamond Necklace: బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వార్తల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆమె ధరించిన ఒక డైమెండ్ నెక్లస్ ధర వందల కోట్ల రూపాయలు ఉందంట.

దేవుడా.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లెస్ అన్ని వందల కోట్లా?

ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఒక్క ఇండియాలోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఫేమస్. బాలీవుడ్ లో నటిగా రాణిస్తూ.. ఆ తర్వాత హాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం మెచ్చే ఒక మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ అమ్మడు ఏం చేసినా కూడా ఊరికే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె కెరీర్, ఆమె వివాహం ఇలా అన్ని విషయాల గురించి తరచూ మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ భామ మరో విషయంలో వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. ఆమె ధరించిన నెక్లెస్ ఒకటి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఆమె ధరించిందా సాదా సీదా నెక్లెస్ కాదండోయ్. దాని ధర ఏకంగా వందల కోట్ల రూపాయలు.

ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ భామ బాలీవుడ్- హాలీవుడ్ చిత్రాలతో ఎవ్వరి ఊహకు అందని ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా కొనసాగుతోంది. సినిమాలు, సోషల్ మీడియా మాత్రమే కాకుండా.. ఈమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవెంట్స్ లో మెరుస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా రోమ్ లో జరిగిన ఒక ఈవెంట్ కి హాజరైంది. అందులో ఏం వింత ఉంది అని అనుకోకండి. ఆ ఈవెంట్ కి ప్రియాంక ధరించిన నెక్లెస్ గురించి ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఆమె ధరించిన వజ్రాలు పొదిగిన ఆ నెక్లెస్ ధర అంత ఉంటుంది కాబట్టి.

తాజాగా రోమ్ లో బుల్గారీ ఫ్యాషన్ డిజైన్ సంస్థ 140వ వార్షికోత్సవం సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. దానికి హాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీలు, తారలను ఆహ్వానించారు. ఆ ఈవెంట్ కే ప్రియాంక చోప్రా హాజరైంది. అయితే ఆమె ధరించిన నెక్లెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ నెక్లెస్ ను అంత ప్రత్యేకంగా తయారు చేశారు. పైగా ఆ నగను తయారు చేసేందుకు బుల్గారీ కళాకారులకు ఏకంగా 2800 గంటలు సమయం పట్టిందంట. అంతేకాకుండా దానిలో పొందు పరిచిన వజ్రాలు కూడా ఎంతో ఖరీదైనవి. ఎంతో ప్రత్యేకమైనవి. అలాంటి నగను ప్రియాంక ధరిచడం అంటే నిజమైన గౌరవం అనే చెప్పాలి అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage)

ఎన్ని వందల కోట్లంటే?:

ప్రియాంక ధరించిన ఆ నెక్లెస్ గురించి యాంకర్ వివరాలు తెలియజేసింది. ఆ నెక్లెస్ ని తయారు చేయడానికి 2,800 గంటలు పట్టిందని చెబుతూనే దాని విలువ చెప్పింది. ఆ నెక్లెస్ ని 140 క్యారెట్ వజ్రాలతో తయారు చేశారు. 698 బాగెట్ వజ్రాలను ఉపయోగించి ఆ నెక్లెస్ ను ప్రత్యేకించి తయారు చేశారు. ఆ నెక్లెస్ విలువ ఏకంగా రూ.358 కోట్లు విలువ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వార్త వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. అలాగే.. ఆ నెక్లెస్.. దానిని ధరించిన ప్రియాంక చోప్రా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by BVLGARI Official (@bvlgari)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి